బలపరీక్ష నెగ్గిన యడియూరప్ప
కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడియూరప్ప బలపరీక్ష నిరూపించుకున్నారు. 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ 104కు పడిపోయింది. దీంతో ఇవాళ యడియూరప్ప బలపరీక్ష గెలవడానికి అవసరమైన సంఖ్య కంటే రెండు ఓట్లు అదనంగా పడ్డాయి. మూజువాణి ఓటు ద్వారా ఆయన బలపరీక్ష నెగ్గినట్లు స్పీకర్ రమేష్ ప్రకటించారు. గత నెలన్నరగా కర్ణాటక రాజకీయాలు పలు మలుపులు తిరిగాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. గవర్నర్, సుప్రీంకోర్టు తీసుకున్న అనేక నిర్ణయాల […]
కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడియూరప్ప బలపరీక్ష నిరూపించుకున్నారు. 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ 104కు పడిపోయింది. దీంతో ఇవాళ యడియూరప్ప బలపరీక్ష గెలవడానికి అవసరమైన సంఖ్య కంటే రెండు ఓట్లు అదనంగా పడ్డాయి. మూజువాణి ఓటు ద్వారా ఆయన బలపరీక్ష నెగ్గినట్లు స్పీకర్ రమేష్ ప్రకటించారు.
గత నెలన్నరగా కర్ణాటక రాజకీయాలు పలు మలుపులు తిరిగాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. గవర్నర్, సుప్రీంకోర్టు తీసుకున్న అనేక నిర్ణయాల నడుమ మైనార్టీలో పడిన కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్ష నెగ్గలేక కుప్పకూలిపోయింది.
ఈ నేపథ్యంలో గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడియూరప్ప .. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకున్నారు.