మేరీకోమ్ కు మరో గోల్డ్

ఆరుసార్లు విశ్వవిజేత మేరీ కోమ్ భారత బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్…అంతర్జాతీయ బాక్సింగ్ లో తన విజయ పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ టైటిల్స్ నెగ్గిన మేరీకోమ్ ..ముగ్గురు బిడ్డల తల్లిగా మరో బంగారు పతకం సాధించడం ద్వారా…వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు గురిపెట్టింది. ఇండోనీషియాలోని లాబున్ బాజో వేదికగా జరిగిన 23వ ప్రెసిడెంట్స్ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీ మహిళల 51 కిలోల విభాగంలో మేరీ కోమ్ స్వర్ణ విజేతగా నిలిచింది. టైటిల్ సమరంలో […]

Advertisement
Update:2019-07-28 16:34 IST
  • ఆరుసార్లు విశ్వవిజేత మేరీ కోమ్

భారత బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్…అంతర్జాతీయ బాక్సింగ్ లో తన విజయ పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ టైటిల్స్ నెగ్గిన మేరీకోమ్ ..ముగ్గురు బిడ్డల తల్లిగా మరో బంగారు పతకం సాధించడం ద్వారా…వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు గురిపెట్టింది.

ఇండోనీషియాలోని లాబున్ బాజో వేదికగా జరిగిన 23వ ప్రెసిడెంట్స్ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీ మహిళల 51 కిలోల విభాగంలో మేరీ కోమ్ స్వర్ణ విజేతగా నిలిచింది.

టైటిల్ సమరంలో ఆస్ట్ర్రేలియా బాక్సర్ ఏప్రిల్ ఫ్రాంక్స్ ను 5-0తో మేరీ కోమ్ చిత్తు చేసింది. 36 ఏళ్ల వయసులో స్వర్ణ పతకం సాధించడం తనకు గర్వకారణంగా ఉందని…తాను పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని విజయానంతరం మేరీ కోమ్ చెప్పింది.

రష్యాలోని ఎకతెరీనాబర్గ్ వేదికగా సెప్టెంబర్ 7 నుంచి 21 వరకూ జరిగే ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలలో అత్యుత్తమంగా రాణించడం ద్వారా.. టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించాలన్న పట్టుదలతో ఉంది.

Tags:    
Advertisement

Similar News