సొంత ఖర్చుతో జగన్‌ విదేశీ పర్యటన

వచ్చే నెల 1 నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఇజ్రాయిల్‌ జెరుసలేం వెళ్తున్నారు. నాలుగు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఈ పర్యటన ముఖ్యమంత్రి వ్యక్తిగతమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పర్యటనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఖర్చు చేయడం లేదు. జగన్‌ మోహన్ రెడ్డి సొంత ఖర్చుతోనే ఈ పర్యటన జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి పర్యటనకు కేంద్ర ప్రభుత్వం […]

Advertisement
Update:2019-07-27 02:18 IST

వచ్చే నెల 1 నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఇజ్రాయిల్‌ జెరుసలేం వెళ్తున్నారు. నాలుగు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఈ పర్యటన ముఖ్యమంత్రి వ్యక్తిగతమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పర్యటనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఖర్చు చేయడం లేదు.

జగన్‌ మోహన్ రెడ్డి సొంత ఖర్చుతోనే ఈ పర్యటన జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి పర్యటనకు కేంద్ర ప్రభుత్వం కూడా అమోదం తెలిపింది. గురువారం తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను ఇజ్రాయిల్ రాయబారి రోన్‌ మాల్కా కలిశారు. ఇజ్రాయిల్ ప్రధానికి అత్యంత సన్నిహితుడైన మాల్కాతో భేటీ సందర్భంగా జగన్‌ ఇజ్రాయిల్ పర్యటన అంశం కూడా చర్చకు వచ్చింది.

రోన్ మాల్కా తన ట్విట్టర్‌లో జగన్‌ ఇజ్రాయిల్ పర్యటనకు స్వాగతం పలికారు. జగన్‌ పర్యటన విజయవంతం కావాలని ఆకాక్షించారు. ఏపీ, ఇజ్రాయిల్ మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని భారత్‌లోని ఇజ్రాయిల్ రాయబారి మాల్కా ఆకాంక్షించారు.

Tags:    
Advertisement

Similar News