కాంగ్రెస్ గ్యారంటీలపై సొంత పార్టీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
నిధుల కొరత కారణంగా రాష్ట్ర ప్రజలకు ఇస్తోన్న కొన్ని ఎన్నికల గ్యారంటీలను వెనక్కి తీసుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తున్న గ్యారంటీల్లో రెండుమూడు పథకాలను వెనక్కి తీసుకోవాలని విజయనగర ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు. నిధుల కొరత కారణంగా పేదలకు పక్కా ఇళ్లు మంజురు చేయలేకపోతున్నామని బహిరంగ సభ సమావేశంలో అన్నారు. అవసరం లేని గ్యారంటీలను తొలిగించి హూసింగ్‌కి నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు.
ఆ ఎమ్మెల్యే అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ఏ పథకాన్ని నిలిపివేసే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. బీపీఎల్ కార్డుల జాబితా నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులను తొలగించాలని కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకుంది. సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై కన్నడ రాజకీయల్లో హాట్ టాఫీక్‌గా మారింది