గాంధీ విగ్రహం పెడుతాం.. 222 ఎకరాల భూమి ఇవ్వండి

డిఫెన్స్‌ భూములు బదలాయించాలని రక్షణ శాఖ మంత్రిని కోరిన సీఎం

Advertisement
Update:2024-11-26 18:34 IST

ప్రపంచంలోనే అత్యంత పెద్దదయిన గాంధీ విగ్రహాన్ని లంగర్‌ హౌజ్‌లోని బాపూఘాట్‌ లో ఏర్పాటు చేస్తామని, అందుకోసం 222 ఎకరాల డిఫెన్స్‌ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తో సీఎం సమావేశమయ్యారు. గుజరాత్‌ లో సర్దార్‌ పటేల్‌ తరహాలోనే హైదరాబాద్‌ లో భారీ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. లంగర్‌హౌస్‌లోని భూములు రక్షణ శాఖ అధీనంలో ఉన్నాయి కాబట్టి ఆ భూములు ఇస్తే వాటికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం మరో చోట భూములు ఇవ్వడంతో పాటు రక్షణ శాఖ నిర్దేశించిన మొత్తం చెల్లిస్తామని తెలిపారు. సికింద్రాబాద్‌ లోని ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట వరకు స్కై వేల నిర్మాణానికి రక్షణ బదలాయించిన భూములకు చెల్లించాల్సిన మొత్తం రిలీజ్‌ చేశామని వివరించారు. లంగర్‌హౌస్‌ లోని భూములు బదలాయించేలా ఆదేశాలు ఇవ్వాలని రక్షణశాఖ మంత్రిని కోరారు.

Tags:    
Advertisement

Similar News