పొరపాటు చేసిన ఓఎస్‌డీ.... ఆగ్రహించిన మంత్రి

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌… తన ఓఎస్‌డీపై విరుచుకుపడ్డారు. సమావేశం ఏజెండా తనకు చెప్పకుండానే ఆస్ట్రేలియా బృందంతో సమావేశం ఏర్పాటు చేయడంపై ఓఎస్‌డీ శ్రీనివాస్‌రెడ్డిని తీవ్ర స్థాయిలో మంత్రి హెచ్చరించారు. ఆస్ట్రేలియా బృందంతో భేటీకి ముందు ఒక సారి… భేటీ తర్వాత మరోసారి శ్రీనివాస్‌ రెడ్డిపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. తనతో భేటీకి ఆస్ట్రేలియా బృందం రాగా మంత్రి సురేష్‌.. తన ఓఎస్‌డీకి క్లాస్ పీకారు. సమావేశం ఏజెండా ఏంటి?. అధికారులు ఎక్కడున్నారు?. హఠాత్తుగా ఆస్ట్రేలియా […]

Advertisement
Update:2019-07-27 02:25 IST

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌… తన ఓఎస్‌డీపై విరుచుకుపడ్డారు. సమావేశం ఏజెండా తనకు చెప్పకుండానే ఆస్ట్రేలియా బృందంతో సమావేశం ఏర్పాటు చేయడంపై ఓఎస్‌డీ శ్రీనివాస్‌రెడ్డిని తీవ్ర స్థాయిలో మంత్రి హెచ్చరించారు. ఆస్ట్రేలియా బృందంతో భేటీకి ముందు ఒక సారి… భేటీ తర్వాత మరోసారి శ్రీనివాస్‌ రెడ్డిపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు.

తనతో భేటీకి ఆస్ట్రేలియా బృందం రాగా మంత్రి సురేష్‌.. తన ఓఎస్‌డీకి క్లాస్ పీకారు. సమావేశం ఏజెండా ఏంటి?. అధికారులు ఎక్కడున్నారు?. హఠాత్తుగా ఆస్ట్రేలియా బృందాన్ని తీసుకొచ్చి చర్చలు జరపండి…. అంటే తాను వారితో ఏం మాట్లాడాలని సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విదేశీ ప్రతినిధులతో సమావేశం ఉన్నప్పుడు విద్యాశాఖ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉండాలి కదా … వారు ఏమయ్యారు? అంటూ రుసరుసలాడారు. అంతలో ఆస్ట్రేలియా బృందం రావడంతో లోతులకు వెళ్లకుండా సమావేశాన్ని మమ అనిపించారు.

ముందే బ్రీఫింగ్ లేకపోవడంతో ఆస్ట్రేలియా బృందం భేటీలో మంత్రి పెద్దగా చర్చించలేకపోయారు. దాంతో భేటీ ముగిసిన తర్వాత మరోసారి ఓఎస్‌డీ శ్రీనివాస్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో మంత్రి విరుచుకుపడ్డారు.

Tags:    
Advertisement

Similar News