టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇక నవశకం

టెస్ట్ క్రికెట్ లీగ్ కు కౌంట్ డౌన్  ఆగస్టు 1 నుంచి రెండేళ్ల పాటు టెస్ట్ లీగ్ సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో తొమ్మిదిదేశాల లీగ్ టోర్నీకి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రెండుశతాబ్దాల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ వినూత్న సమరానికి రంగం సిద్ధమయ్యింది. కొద్దిదేశాలకు మాత్రమే పరిమితమైన క్రికెట్ ను…విశ్వవ్యాప్తం చేయటానికి ఐసీసీ నడుం బిగించింది. ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కు..జవజీవాలు కల్పించేలా…ప్రత్యేక లీగ్ నిర్వహించడానికి రంగం మూడేళ్ల కార్యక్రమానికి రూపకల్పన చేసింది. న్యూజిలాండ్ నగరం అక్లాండ్ లో […]

Advertisement
Update:2019-07-26 09:45 IST
  • టెస్ట్ క్రికెట్ లీగ్ కు కౌంట్ డౌన్
  • ఆగస్టు 1 నుంచి రెండేళ్ల పాటు టెస్ట్ లీగ్

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో తొమ్మిదిదేశాల లీగ్ టోర్నీకి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రెండుశతాబ్దాల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ వినూత్న సమరానికి రంగం సిద్ధమయ్యింది.

కొద్దిదేశాలకు మాత్రమే పరిమితమైన క్రికెట్ ను…విశ్వవ్యాప్తం చేయటానికి ఐసీసీ నడుం బిగించింది. ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కు..జవజీవాలు కల్పించేలా…ప్రత్యేక లీగ్ నిర్వహించడానికి రంగం మూడేళ్ల కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

న్యూజిలాండ్ నగరం అక్లాండ్ లో ముగిసిన ఐసీసీ బోర్డు వార్షిక సమావేశంలో… చైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలో ఈ కీలక నిర్ణయాన్ని ఐసీసీ గత ఏడాదే తీసుకొంది.

9 దేశాల సమరం…

టెస్ట్ హోదా పొందిన దేశాలకు చెందిన తొమ్మిదిజట్లతో ….టెస్ట్ క్రికెట్ లీగ్ ను నిర్వహిస్తారు. రెండేళ్లపాటు జరిగే ఈ లీగ్ ను మూడు స్వదేశీ సిరీస్ లు, మూడు విదేశీ సిరీస్ లుగా నిర్వహిస్తారు.

మొత్తం తొమ్మిదిజట్ల నడుమ 27 ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించడం ద్వారా విజేతను నిర్ణయించనున్నారు.

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా, రెండో ర్యాంకర్ న్యూజిలాండ్, మూడో ర్యాంకర్ సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు….టెస్ట్ క్రికెట్ లీగ్ లో ఢీ కొనబోతున్నాయి.

యాషెస్ సిరీస్ తో షురూ…

2019 ఆగస్టు 1 నుంచి 2021 ఏప్రియల్ 30 మధ్యకాలంలో టెస్ట్ క్రికెట్ లీగ్ జరుగనుంది. బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్- ఆస్ట్ర్ర్లేలియా జట్ల యాషెస్ సిరీస్ లోని తొలిటెస్ట్ మ్యాచ్ తో టెస్ట్ లీగ్ లోని తొలిమ్యాచ్ కు తెరలేవనుంది.

టెస్ట్ హోదా పొందిన ఒక్కో జట్టు…మూడు స్వదేశీ, మూడు విదేశీ సిరీస్ ల్లో తలపడాల్సి ఉంది. మొత్తం సిరీస్ ల్లో అత్యధిక పాయింట్లు సాధించిన మొదటి రెండుజట్లు…ఇంగ్లండ్ వేదికగా 2021 జూన్ లో జరిగే ఫైనల్లో తలపడనున్నాయి.

సిరీస్ కు 120 పాయింట్లు…

ఒక్కో ద్వైపాక్షిక సిరీస్ లో మ్యాచ్ ల ప్రమేయం లేకుండా 120 పాయింట్లు చొప్పున అందుబాటులో ఉంటాయి. ఒక్కో జట్టుకు అత్యధికంగా 720 పాయింట్లు సాధించే అవకాశం ఉంది.

ఇదీ భారత టెస్ట్ షెడ్యూల్…

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ ఆగస్టు 21 నుంచి కరీబియన్ ద్వీపాలు వేదికగా వెస్టిండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తలపడనుంది.

2019 అక్టోబర్లో సౌతాఫ్రికా వేదికగా మూడుమ్యాచ్ ల సిరీస్ లో భారత్ ఢీ కోనుంది.

2019 నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు భారత్ ఆతిథ్యమివ్వనుంది.

2020 ఫిబ్రవరి-మార్చి మాసాలలో న్యూజిలాండ్ వేదికగా జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ పోటీపడుతుంది.

2020 నవంబర్ నుంచి 2021 జనవరి మధ్యకాలంలో ఆస్ట్ర్రేలియా వేదికగా కంగారూ జట్టుతో జరిగే నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ పోటీపడుతుంది.

2021 జనవరి-మార్చి మాసాల మధ్యకాలంలో ఇంగ్లండ్ గడ్డపై జరిగే ఐదుమ్యాచ్ ల సిరీస్ తో తన టెస్ట్ లీగ్ పోరాటాన్ని భారత్ ముగించనుంది.

ఆగస్టు 22 నుంచి విండీస్ తో టెస్ట్ సమరం

ఆంటీగాలోని నార్త్ సౌండ్ వేదికగా ఆగస్టు 22 నుంచి జరిగే తొలిటెస్ట్ లో విండీస్ తో భారత్ ఢీ కొంటుంది. రెండోటెస్ట్ మ్యాచ్ కు జమైకాలోని కింగ్స్ టన్ ఆతిథ్యమిస్తుంది. ఈ పోటీ ఆగస్టు 30 నుంచి ఐదురోజులపాటు జరుగనుంది.

Tags:    
Advertisement

Similar News