చంద్రుడు మీద ఐదు ఎకరాలు కొన్నా.... ఇదే ఆ స్థలం

ఒక వ్యక్తి చంద్రుడి మీద ఐదు ఎకరాలు కొనేశానని చెబుతున్నాడు. అందుకు సంబంధించిన పత్రాలను, స్థలం తాలూకు ఫొటోలను కూడా చూపిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన రాజీవ్ భాగడి తాను చందమామ మీద ఐదు ఎకరాలు కొన్నట్టు చెబుతున్నారు. భవిష్యత్తులో అక్కడికి వెళ్లి టౌన్‌ షిప్ నిర్మించి కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి నివాసం ఉండాలన్నది తన ఆశయం అంటున్నాడు. 2003లో లూనార్ రిపబ్లిక్ సొసైటీ నుంచి తాను ఐదు ఎకరాల చంద్రుడిని కొన్నట్టు అతడు చెబుతున్నారు. వారు ఇచ్చిన […]

Advertisement
Update:2019-07-26 06:04 IST

ఒక వ్యక్తి చంద్రుడి మీద ఐదు ఎకరాలు కొనేశానని చెబుతున్నాడు. అందుకు సంబంధించిన పత్రాలను, స్థలం తాలూకు ఫొటోలను కూడా చూపిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన రాజీవ్ భాగడి తాను చందమామ మీద ఐదు ఎకరాలు కొన్నట్టు చెబుతున్నారు. భవిష్యత్తులో అక్కడికి వెళ్లి టౌన్‌ షిప్ నిర్మించి కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి నివాసం ఉండాలన్నది తన ఆశయం అంటున్నాడు.

2003లో లూనార్ రిపబ్లిక్ సొసైటీ నుంచి తాను ఐదు ఎకరాల చంద్రుడిని కొన్నట్టు అతడు చెబుతున్నారు. వారు ఇచ్చిన పత్రాలను, సైట్ తాలూకు ఫోటోలను మీడియాకు చూపించాడు.

2003లో 140 అమెరికన్ డాలర్లు చెల్లించి ఈ కొనుగోలు జరిపాడట. అయితే ఇందంతా మోసం అని నిపుణులు చెబుతున్నారు.

చంద్రుడిపై ఎవరికీ హక్కులు లేవు…. కాబట్టి కొందరు మోసగాళ్లు ఇలా చంద్రుడిని కూడా అమ్మకానికి పెడుతున్నారని చెబుతున్నారు.

చంద్రుడి మీద పూర్తి స్థాయి పరిస్థితులపైనా నాసాకే అంచనా లేదని… అలాంటిది అక్కడికి వెళ్లి ఇల్లు కట్టుకుంటామని కొందరు కొనుగోళ్లు చేయడం అత్యుత్సాహం, అమాయకత్వమే అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News