రైతులూ.... ఆత్మహత్యలు వద్దు.... కౌలు రైతులకు ప్రభుత్వం అండ....

రాష్ట్ర్రంలో ఉన్న కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, రాష్ట్ర్రంలో కౌలు రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు. “రాష్ట్ర్రవ్యాప్తంగా 16 లక్షల మంది కౌలు రైతులున్నారు. వారందరికీ ఏడాదికి 12,500 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తాం” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం మేం కట్టుబడి ఉన్నామని, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని సీఎం చెప్పారు. […]

Advertisement
Update:2019-07-26 02:15 IST

రాష్ట్ర్రంలో ఉన్న కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, రాష్ట్ర్రంలో కౌలు రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

“రాష్ట్ర్రవ్యాప్తంగా 16 లక్షల మంది కౌలు రైతులున్నారు. వారందరికీ ఏడాదికి 12,500 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తాం” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం మేం కట్టుబడి ఉన్నామని, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని సీఎం చెప్పారు.

రైతులూ…. ఆత్మహత్యలు వద్దు : మంత్రి కన్నబాబు

ఆంధ్రప్రదేశ్ లో రైతులను ఆదుకునేందుకు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, పెట్టుబడి సాయంతో పాటు ఇతరత్రా అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలపై శాసనమండలిలో గురువారం నాడు చర్చ జరిగింది.ఈ చర్చకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమాధానం చెబుతూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు.

“గత తెలుగుదేశం ప్రభుత్వం కారణంగా రైతులు ఇక్కట్ల పాలయ్యారు. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. రైతులూ… దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. మీకు అండగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు” అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

భూయజమానులకే కాకుండా కౌలు రైతులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర్రంలో విత్తనాల కొరతకు కారణం గత తెలుగుదేశం ప్రభుత్వమేనని, వ్యవసాయ శాఖకు చెందిన అధికారులు విత్తనాల కొరత ఏర్పడుతుందని ఎన్నిసార్లు లేఖలు రాసినా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

“ఎన్నికలకు ముందు మహిళల ఓట్ల కోసం పసుపు – కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఎన్నికల ముందు ఇన్ని చర్యలు తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఐదేళ్లలో రైతులను మాత్రం పట్టించుకోలేదు” అని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News