రసపట్టుగా లార్డ్స్ టెస్ట్

సంచలన విజయానికి పసికూన తహతహ ఇంగ్లండ్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఐర్లాండ్ క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరుగుతున్న నాలుగురోజుల సింగిల్ టెస్ట్ మ్యాచ్ లో వన్డే ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ కు పసికూన ఐర్లాండ్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తొలిఇన్నింగ్స్ లో 85 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో సైతం భారీ ఆధిక్యత సాధించలేకపోయింది. రెండోరోజుఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 303 పరుగులు మాత్రమే చేసి..181 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో ఉంది. ఆఖరి వికెట్ మాత్రమే చేతిలో […]

Advertisement
Update:2019-07-26 06:05 IST
  • సంచలన విజయానికి పసికూన తహతహ
  • ఇంగ్లండ్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఐర్లాండ్

క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరుగుతున్న నాలుగురోజుల సింగిల్ టెస్ట్ మ్యాచ్ లో వన్డే ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ కు పసికూన ఐర్లాండ్ ముచ్చెమటలు పట్టిస్తోంది.

తొలిఇన్నింగ్స్ లో 85 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో సైతం భారీ ఆధిక్యత సాధించలేకపోయింది. రెండోరోజుఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 303 పరుగులు మాత్రమే చేసి..181 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో ఉంది. ఆఖరి వికెట్ మాత్రమే చేతిలో మిగిలి ఉంది.

ఇంగ్లండ్ ఓపెనర్ లీచ్ 92 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టెస్ట్ అరంగేట్రం ఆటగాడు జేసన్ రాయ్ 72 పరుగులు, యువఆల్ రౌండర్ సామ్ కరెన్ 37 పరుగులు సాధించారు.

స్టువర్ట్ బ్రాడ్ 21, స్టోన్ పరుగులేవీ లేకుండాను క్రీజులో ఉన్నారు. ఐర్లాండ్ బౌలర్లలో అడెయిర్ 3, రాంకిన్, థాంప్సన్ చెరో రెండు వికెట్లు, ముర్టాగ్ 1 వికెట్ పడగొట్టారు.

సంచలన విజయం వైపు ఐర్లాండ్ చూపు…

తొలిఇన్నింగ్స్ లో 207 పరుగులతో భారీ ఆధిక్యం సాధించిన ఐర్లాండ్…రెండో ఇన్నింగ్స్ లో 200 పరుగులకు లోపు ఇంగ్లండ్ ను ఆలౌట్ చేయగలిగితే.. టెస్ట్ మ్యాచ్ లో సంచలన విజయం సాధించే అవకాశాలు లేకపోలేదు.

గత ఏడాదే టెస్ట్ హోదా పొందిన ఐర్లాండ్ కు కేవలం రెండుటెస్ట్ మ్యాచ్ లు ఆడిన అనుభవం మాత్రమే ఉంది. అరంగేట్రం టెస్టులో పాకిస్థాన్, రెండో టెస్టులో అఫ్ఘనిస్థాన్ చేతిలో పరాజయాలు పొందిన ఐర్లాండ్…తన మూడోటెస్ట్ మ్యాచ్ లో..ఇంగ్లండ్ తో పోటీపడుతున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News