సీఎం జగన్‌ హెలిపాడ్‌ దగ్గర్లోనే 54 బాంబులు

జమ్మలమడుగులో బాంబులు బయటపడ్డాయి. భూమిలో పాతిపెట్టిన 54 బాంబులను పోలీసులు వెలికితీశారు. నాలుగు బకెట్లలో వీటిని ఉంచారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సమీప బంధువు పురుషోత్తం రెడ్డికి చెందిన భూమిలోనే ఈ బాంబులు బయటపడ్డాయి. ఈ భూమిలో వెంచర్‌ వేయగా… జేసీబీ సాయంతో తవ్వుతున్న సమయంలో ఇవి బయటపడ్డాయి. దీంతో డీఎస్పీ, సీఐ తదితరులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నాలుగు బకెట్లు ఒకే చోట కాకుండా పలుచోట్ల  బయటపడ్డాయి. ఈనెల 8న ముఖ్యమంత్రి […]

Advertisement
Update:2019-07-24 03:18 IST

జమ్మలమడుగులో బాంబులు బయటపడ్డాయి. భూమిలో పాతిపెట్టిన 54 బాంబులను పోలీసులు వెలికితీశారు. నాలుగు బకెట్లలో వీటిని ఉంచారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సమీప బంధువు పురుషోత్తం రెడ్డికి చెందిన భూమిలోనే ఈ బాంబులు బయటపడ్డాయి.

ఈ భూమిలో వెంచర్‌ వేయగా… జేసీబీ సాయంతో తవ్వుతున్న సమయంలో ఇవి బయటపడ్డాయి. దీంతో డీఎస్పీ, సీఐ తదితరులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నాలుగు బకెట్లు ఒకే చోట కాకుండా పలుచోట్ల బయటపడ్డాయి. ఈనెల 8న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి జమ్మలమడుగు పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడే హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు.

హెలిపాడ్‌కు సమీపంలోనే 150 మీటర్ల పరిధిలో ఈ బాంబుల బకెట్లు బయటపడ్డాయి. అయితే సీఎం వచ్చిన సమయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసినప్పటికీ సమీపంలోనే ఉన్న బాంబులను ఎందుకు గుర్తించలేకపోయారు అన్న దానిపైనా చర్చ జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News