రాజకీయాలకు సెలవు పెట్టిన రఘువీరా

ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి రాజకీయాలకు తాత్కాలికంగా సెలవు పెట్టారు. ఆరు నెలల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. తన సొంతూరు నీలకంఠాపురంలో ఒక ఆలయం నిర్మిస్తున్నానని… అది పూర్తయ్యే వరకు రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘువీరారెడ్డి… ఆరు నెలల పాటు పూర్తిగా తాను ఆలయ నిర్మాణం పైనే దృష్టి పెడుతున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో…. రఘువీరారెడ్డి కూడా ఇటీవల పీసీసీ […]

Advertisement
Update:2019-07-24 07:44 IST

ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి రాజకీయాలకు తాత్కాలికంగా సెలవు పెట్టారు. ఆరు నెలల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు.

తన సొంతూరు నీలకంఠాపురంలో ఒక ఆలయం నిర్మిస్తున్నానని… అది పూర్తయ్యే వరకు రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘువీరారెడ్డి… ఆరు నెలల పాటు పూర్తిగా తాను ఆలయ నిర్మాణం పైనే దృష్టి పెడుతున్నట్టు చెప్పారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో…. రఘువీరారెడ్డి కూడా ఇటీవల పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు హైకమాండ్‌కు లేఖ పంపారు.

అయితే అది ఆమోదం పొందలేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో పూర్తి స్తబ్ధత నెలకొన్న నేపథ్యంలో రఘువీరారెడ్డి సొంతూరులో ఆలయ నిర్మాణంపై దృష్టి పెట్టారు.

Tags:    
Advertisement

Similar News