దొనకొండను పరిశీలించిన సీనియర్ అధికారుల బృందం
ప్రకాశం జిల్లా దొనకొండలో ఎయిర్‌పోర్టు అభివృద్దికి అడుగులు పడుతున్నాయి. బ్రిటీష్ హయాంలోనే దొనకొండ వద్ద ఎయిర్‌పోర్టు నిర్మించారు. ఇక్కడి నుంచి కార్యక్రమాలు నడిపారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ విమానాలకు ఇంధనం నింపేందుకు కూడా ఈ ఎయిర్‌పోర్టు ఉపయోగపడింది. ఆ తర్వాత ఈ ఎయిర్‌పోర్టు నిర్లక్ష్యానికి గురైంది. అయితే దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించిన నేపథ్యంలో… పాత విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర విమానయాన శాఖ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా బ్రిటిష్ హయాంలో నిర్మించిన […]
ప్రకాశం జిల్లా దొనకొండలో ఎయిర్‌పోర్టు అభివృద్దికి అడుగులు పడుతున్నాయి. బ్రిటీష్ హయాంలోనే దొనకొండ వద్ద ఎయిర్‌పోర్టు నిర్మించారు. ఇక్కడి నుంచి కార్యక్రమాలు నడిపారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ విమానాలకు ఇంధనం నింపేందుకు కూడా ఈ ఎయిర్‌పోర్టు ఉపయోగపడింది. ఆ తర్వాత ఈ ఎయిర్‌పోర్టు నిర్లక్ష్యానికి గురైంది. అయితే దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించిన నేపథ్యంలో… పాత విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర విమానయాన శాఖ ముందుకొచ్చింది.
ఇందులో భాగంగా బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఎయిర్‌పోర్టును ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ అధికారుల ప్రత్యేక బృందం పరిశీలించింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు పరిధిలో ఎంత భూమి ఉంది… అభివృద్ధి చేసేందుకు ఇంకెంత భూమి కావాలన్న దానిపై అధికారులు పరిశీలన చేశారు.
దొనకొండ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే దొనకొండ ఎయిర్‌పోర్టుకు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది.