45 ఏళ్లకే పించన్ ఇస్తామని మేం చెప్పలేదు

45 ఏళ్లు పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పించన్ ఇస్తామని తాము హామీ ఇవ్వలేదన్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. తొలుత అలాంటి ఆలోచన చేసినా 45 ఏళ్లకే పించన్‌ ఇవ్వడం ఏమిటి అన్న అభ్యంతరం రావడంతో పించన్ కాకుండా ఐదేళ్లలో నాలుగు విడతలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 75వేలు ఇవ్వాలని నిర్ణయించామని జగన్ వివరించారు. ఎన్నికల ప్రచారంలో తాము అదే విషయాన్ని చెప్పామంటూ అసెంబ్లీలో వీడియోను జగన్ ప్రదర్శించారు. ఇందుకు ప్రతిపక్షం అభ్యంతరం […]

Advertisement
Update:2019-07-23 05:40 IST

45 ఏళ్లు పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పించన్ ఇస్తామని తాము హామీ ఇవ్వలేదన్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. తొలుత అలాంటి ఆలోచన చేసినా 45 ఏళ్లకే పించన్‌ ఇవ్వడం ఏమిటి అన్న అభ్యంతరం రావడంతో పించన్ కాకుండా ఐదేళ్లలో నాలుగు విడతలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 75వేలు ఇవ్వాలని నిర్ణయించామని జగన్ వివరించారు. ఎన్నికల ప్రచారంలో తాము అదే విషయాన్ని చెప్పామంటూ అసెంబ్లీలో వీడియోను జగన్ ప్రదర్శించారు.

ఇందుకు ప్రతిపక్షం అభ్యంతరం తెలిపింది. 45 ఏళ్లు పైబడిన ఎస్సీఎస్టీబీసీ మహిళలందరికీ పించన్‌ ఇస్తామని జగన్‌ చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా తమ వద్ద ఉందని… దాన్ని కూడా అసెంబ్లీలో ప్రదర్శించాలని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అలా రెండు వీడియోలను ప్రదర్శించి నిర్ణయాన్ని ప్రజలకు వదిలేద్దామని సూచించారు. అయితే అచ్చెన్నాయుడు విజ్ఞప్తిని డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించారు.

దాంతో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత కూడా పించన్ల అంశంపై ఇరుపక్షాల మధ్య వాడీవేడీగా చర్చ సాగింది.

ఎస్సీ ఎస్టీ బీసీ లకు సంబంధించిన కీలకమైన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతుంటే … ఎక్కడ కొత్త ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అన్న అసూయతోనే సభను టీడీపీ పదేపదే అడ్డుకుంటోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. దీన్ని బట్టే వెనుకబడిన వర్గాల పట్ల టీడీపీ వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

Tags:    
Advertisement

Similar News