సినిమాకే కాదు.... ప్రమోషన్స్ కూ భారీగా ఖర్చు

ప్రభాస్ ప్రధాన పాత్ర లో త్వరలో రానున్న చిత్రం సాహో. ప్రభాస్ హీరో గా శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా రానున్న ఈ సినిమా ని సుజీత్ దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. కానీ సినిమా కి సంబందించిన నిర్మాణాంతర పనుల్లో కాస్త జాప్యం జరగనుండటం వలన ఈ సినిమా అనుకున్న టైం కి విడుదల కావడం లేదు. వచ్ఛే నెల 15 న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా […]

Advertisement
Update:2019-07-22 00:32 IST

ప్రభాస్ ప్రధాన పాత్ర లో త్వరలో రానున్న చిత్రం సాహో. ప్రభాస్ హీరో గా శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా రానున్న ఈ సినిమా ని సుజీత్ దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. కానీ సినిమా కి సంబందించిన నిర్మాణాంతర పనుల్లో కాస్త జాప్యం జరగనుండటం వలన ఈ సినిమా అనుకున్న టైం కి విడుదల కావడం లేదు. వచ్ఛే నెల 15 న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చే నెల 30 కి వెళ్ళింది. కానీ సినిమా ప్రమోషన్స్ మాత్రం ఆగడం లేదు.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే,సినిమా ప్రమోషన్స్ లో భాగం గా సాహో టీమ్ ఒక స్పెషల్ కార్ ని వాడబోతున్నారు అని తెలిసింది.

ఈ కార్ ని సినిమా లో దుబాయ్ ఛేజింగ్ సమయం లో వాడారట. దీనిని ఆస్ట్రియా లో స్పెషల్ గా ఐదు కోట్ల ఖర్చు తో తయారు చేయించారట. ఈ కార్ ని ఇప్పుడు ఇండియా కి తెప్పించి ప్రమోషన్స్ లో వాడాలనే ఉదేశ్యం తో ఉన్నారట దర్శక నిర్మాతలు. అంతే కాకుండా కొన్ని బైక్స్ ని కూడా ప్రమోషన్స్ లో వాడాలనే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Tags:    
Advertisement

Similar News