తెలంగాణాలో వర్షాలు కురుస్తాయి... బెంగవద్దు " రంగంలో స్వర్ణలత

తెలంగాణాలో వర్షాలు కురుస్తాయని, ప్రజలు బెంగ పెట్టుకోవద్దని మహంకాళి బోనాల అనంతరం జరిగిన రంగంలో స్వర్ణలత చెప్పారు. ప్రతి ఏటా లష్కర్ బోనాల తర్వాత స్వర్ణలత భవిష్యవాణిని వినిపించడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని అనుసరించి సోమవారం ఉదయం స్వర్ణలత రంగం కార్యక్రమంలో తెలంగాణ భవిష్యత్ ను వివరించారు. తెలంగాణాలో ప్రజలందరూ సుఖంగా ఉండడమే తన కోరిక అని, అక్కచెల్లెళ్లు సంతోషంగా ఉంటే తాను సంతోషంగా ఉంటానని భవిష్యవాణి వినిపించారు జోగిని స్వర్ణలత. ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఈ […]

Advertisement
Update:2019-07-22 05:12 IST

తెలంగాణాలో వర్షాలు కురుస్తాయని, ప్రజలు బెంగ పెట్టుకోవద్దని మహంకాళి బోనాల అనంతరం జరిగిన రంగంలో స్వర్ణలత చెప్పారు. ప్రతి ఏటా లష్కర్ బోనాల తర్వాత స్వర్ణలత భవిష్యవాణిని వినిపించడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని అనుసరించి సోమవారం ఉదయం స్వర్ణలత రంగం కార్యక్రమంలో తెలంగాణ భవిష్యత్ ను వివరించారు.

తెలంగాణాలో ప్రజలందరూ సుఖంగా ఉండడమే తన కోరిక అని, అక్కచెల్లెళ్లు సంతోషంగా ఉంటే తాను సంతోషంగా ఉంటానని భవిష్యవాణి వినిపించారు జోగిని స్వర్ణలత.

ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా జాతర నిర్వహించడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. గత ఏడాది బోనాలపై అసంత్రప్తి వ్యక్తం చేసిన స్వర్ణలత ఈ సారి మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం.

“అమ్మకు గంగతో అభిషేకం చేయండి. బోనాలు సమర్పించండి. రాష్ట్రంలో మంచి జరుగుతుంది ” అని జోగిని స్వర్ణలత అన్నారు. ప్రజలందరూ సంతోషంగా ముడుపులు చెల్లించుకున్నారని, ఆ ముడుపులు తాను సంతోషంగా అందుకున్నానని స్వర్ణలత చెప్పారు. తన బిడ్డలను సంతోషంగా ఉంచే బాధ్యత తనదేనని చెప్పిన స్వర్ణలత తనకు పూజలు ఎందుకు ఆపుతున్నారని మండిపడ్డారు.

“ఐదు వారాల పాటు పప్పు బెల్లాలు, సాకలతో అమ్మవారిని పూజించండి. అమ్మవారు కరుణించి భక్తులను ఆదుకుంటుంది” అని స్వర్ణలత అన్నారు. ఈ పూజలు తాను పొలిమేర దాటి వెళ్లకముందే నిర్వహించాలని రంగంలో షరతు విధించారు స్వర్ణలత.

శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు జరిగిన మహంకాళి బోనాలు సోమవారంతో ముగిసాయి. రాష్ట్ర్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.

మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి కుమార్తె కవిత అమ్మవారికి బోనాలు సమర్పించారు. జాతర ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా అమ్మవారికి తొలి బోనాలు సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతే కాదు ఈ సందర్భంగా తన సహచరులతో కలిసి మంత్రి డ్యాన్స్ చేస్తూ జాతరకు వచ్చిన వారిని మరింత ఉత్సాహ పరిచారు.

Tags:    
Advertisement

Similar News