ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అయితే... ఏపీలో బీజేపీ కూడా....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ నిలదొక్కుకోలేదని పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, మేథావులు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ఓ ఛానెల్ నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్న పలువురు రాజకీయ నాయకులు, టెలిఫోన్ లో పాల్గొన్న సామాన్య ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు […]

Advertisement
Update:2019-07-22 12:00 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ నిలదొక్కుకోలేదని పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, మేథావులు అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ఓ ఛానెల్ నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్న పలువురు రాజకీయ నాయకులు, టెలిఫోన్ లో పాల్గొన్న సామాన్య ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు పురంద్రీశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు చేయడం మానుకోవాలని విద్యావంతుల వేదిక కన్వీనర్ కే.ఎస్.రావు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.

“ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని పురంద్రీశ్వరి అంటున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా ముగిసిన అధ్యాయంగానే మారుతుంది” అని ఆయన మండిపడ్డారు.

ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ అన్నారు. భారతీయ జనతా పార్టీ మాట మారిస్తే ప్రజలు సహించరని, బీజేపీ నాయకురాలు పురంధ్రీశ్వరి ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదని హితవు పలికారు.

“రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. దాన్ని మేం వదిలేది లేదు. సామ, దాన, దండోపాయాలతో ప్రత్యేక హోదా సాధిస్తాం” అని శివశంకర్ స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని, మడమ తిప్పారని తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని తిరుపతి నుంచి ఓ కాలర్ అభిప్రాయ పడ్డారు.

“ఎన్నికల ప్రచారంలో కాని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాని జగన్మోహన్ రెడ్డి ఒకే మాట మీద ఉన్నారు. నా రాష్ట్రానికి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికి మద్దతు ఇస్తానన్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇచ్చినా వారికి మద్దతు ఇస్తాను అని జగన్ చెప్పారు” అని ఆ కాలర్ చెప్పారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలపడాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేకపోతే ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయని ఆయన అన్నారు.

భారతీయ జనతా పార్టీ ఏది చెప్పిందో అది చేయడం లేదని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాంమ్మోహన్ అన్నారు.

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని బీజేపీ నాయకురాలు పురంధ్రీశ్వరి అంటున్నారు. మరి సక్రమమైన మార్గమేమిటో ఆమె చెప్పాలి కదా” అని రాంమ్మోహన్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News