హైదరాబాద్ క్రికెట్ సంఘానికి సలహామండలి

ప్రశాంతంగా ముగిసిన 84వ సర్వసభ్య సమావేశం హైదరాబాద్ క్రికెట్ సంఘం 84వ సర్వసభ్య సమావేశం విజయవంతంగా ముగిసింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ సమావేశాన్ని సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలకమండలి ఆదేశాలకు అనుగుణంగా నిర్వహించారు. అధ్యక్షుడు డాక్టర్ అనీల్ కుమార్ ఆధ్వర్యంలో ముగిసిన ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. సీనియర్, జూనియర్ విభాగాల కోసం.. ప్రత్యేక సలహామండలులను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆంబుడ్స్ మన్ కమ్ ఎథిక్స్ అధికారిగా […]

Advertisement
Update:2019-07-22 16:47 IST
  • ప్రశాంతంగా ముగిసిన 84వ సర్వసభ్య సమావేశం

హైదరాబాద్ క్రికెట్ సంఘం 84వ సర్వసభ్య సమావేశం విజయవంతంగా ముగిసింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ సమావేశాన్ని సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలకమండలి ఆదేశాలకు అనుగుణంగా నిర్వహించారు.

అధ్యక్షుడు డాక్టర్ అనీల్ కుమార్ ఆధ్వర్యంలో ముగిసిన ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. సీనియర్, జూనియర్ విభాగాల కోసం.. ప్రత్యేక సలహామండలులను ఏర్పాటు చేశాయి.

హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆంబుడ్స్ మన్ కమ్ ఎథిక్స్ అధికారిగా జస్టిస్ ఎమ్ఎన్ రావ్ ను నియమించారు. ఎన్నికల నిర్వహణ అధికారిగా వీఎస్ సంపత్ ను, బీసీసీఐ సమావేశాలకు హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధిగా డాక్టర్ జీ. వివేకానందను ఖరారు చేస్తూ తీర్మానాలు ఆమోదించారు.

హైదరాబాద్ క్రికెట్ సంఘం సలహా మండలి సభ్యులుగా వెంకటపతి రాజు, నరసింహారావు, పూర్ణిమారావులను నియమించారు.
జూనియర్ క్రికెట్ కమిటీలో వివేక్ జయసింహా, నోయెల్ డేవిడ్, రాజేశ్ యాదవ్, శివాజీ యాదవ్ లను సభ్యులుగా ఎంపిక చేశారు.

జస్టిస్ లోథా కమిటీ ఆదేశాలు, నియమావళికి అనుగుణంగానే తాము సర్వసభ్యసమావేశం నిర్వహించినట్లు హెచ్ సిఏ చైర్మన్ ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News