తెలంగాణలో చురుకుగా రుతుపవనాలు

నాలుగు వర్షపు చినుకుల కోసం ఆకాశం వైపు చూసిన తెలంగాణ రైతుల కరువు తీరనున్నది. ఏరువాక ప్రారంభమై నెల గడుస్తున్నా చినుకు జాడ లేక వర్షాల కోసం ఎదురు తెన్నులు చూసిన తెలంగాణ రైతులకు రుతుపవనాలు చురుకుగా కదులుతూ ఆశల రేకెత్తిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతు పవనాలు అతి వేగంగా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో సహా నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, అదిలాబాద్ జిల్లాల్లో […]

Advertisement
Update:2019-07-20 05:10 IST

నాలుగు వర్షపు చినుకుల కోసం ఆకాశం వైపు చూసిన తెలంగాణ రైతుల కరువు తీరనున్నది. ఏరువాక ప్రారంభమై నెల గడుస్తున్నా చినుకు జాడ లేక వర్షాల కోసం ఎదురు తెన్నులు చూసిన తెలంగాణ రైతులకు రుతుపవనాలు చురుకుగా కదులుతూ ఆశల రేకెత్తిస్తున్నాయి.

మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతు పవనాలు అతి వేగంగా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో సహా నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, అదిలాబాద్ జిల్లాల్లో శుక్రవారం నాడు భారీ వర్షాలు కురిసాయి.

నిజామాబాద్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. జిల్లా కేంద్రంతో పాటు అనేక మండలాల్లో భారీ వర్షాలు కురిసాయి. బోథ్, భైంసా, గుడిహత్నూరులలో గతం కంటే ఎక్కువ వర్షాలు కురిసినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసాయి. పరకాల, మహబూబ్ నగర్, హన్మకొండలతో పాటు పలు మండలాల్లో భారీ వర్షాలు కురిసాయి. ఇక కరీంనగర్ పట్టణంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం ఉదయం నుంచే వర్షాలు పడుతున్నాయి.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, తార్నాక, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, బోయినపల్లి, కూకట్ పల్లి, చిక్కడపల్లిలో భారీ వర్షాలు కురిసాయి. తెలంగాణలో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ వర్షాలతో రైతుల తమ వ్యవసాయ పనులను ముమ్మరం చేయనున్నారు.ఇప్పటికే దుక్కి దున్ని పొలాలను సిద్ధం చేసిన రైతాంగం వర్షాలతో ఇతర వ్యవసాయ పనులను వేగవంతం చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News