సంచలన చట్టాలకు నేడు మంత్రివర్గ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ లో కీలక, సంచలన చట్టాలకు ఆమోద ముద్ర వేసేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమై కీలకమైన చట్టాలకు సవరణతో పాటు కొన్ని బిల్లులకు కూడా ఆమోదముద్ర వేయనుంది. నామినేటెడ్ పదవుల పందారంతో పాటు కొన్ని ప్రభుత్వ పనులలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్సించే సంచలన చట్టానికి మంత్రివర్గం నేడు ఆమోదముద్ర వేయనుంది.ఇది దేశంలో తొలిసారిగా ఓ […]

Advertisement
Update:2019-07-18 04:55 IST

ఆంధ్రప్రదేశ్ లో కీలక, సంచలన చట్టాలకు ఆమోద ముద్ర వేసేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమై కీలకమైన చట్టాలకు సవరణతో పాటు కొన్ని బిల్లులకు కూడా ఆమోదముద్ర వేయనుంది.

నామినేటెడ్ పదవుల పందారంతో పాటు కొన్ని ప్రభుత్వ పనులలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్సించే సంచలన చట్టానికి మంత్రివర్గం నేడు ఆమోదముద్ర వేయనుంది.ఇది దేశంలో తొలిసారిగా ఓ రాష్ట్ర్ర ప్రభుత్వం ఆమోదిస్తున్న చట్టంగా నిపుణులు చెబుతున్నారు.

ఈ చట్ట సవరణ కారణంగా భవిష్యత్ లో ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి పదవుల పంపకంతో పాటు వివిధ పనుల్లో కూడా ప్రాధాన్యం లభిస్తుంది. ఎప్పటి నుంచో వివాదంగా మారిన భూరికార్డుల సవరణ చట్టానికి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు దేవాదాయ చట్టాన్ని సవరించడం, ప్రతిష్టాత్మకమైన లోకాయుక్త నియామకం వంటి అంశాలపై కూడా చట్టాలను సవరించడం, నూతన చట్టాలను తీసుకురావడం వంటి అంశాలపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది.

భూ యజమానులైన రైతులతో పాటు కౌలు రైతులకు కూడా మేలు జరిగేలా నూతన చట్టాన్ని తీసుకురానున్నారు. ఈ చట్టం ద్వారా పెట్టుబడి సాయం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా దక్కేలా చట్టాన్ని రూపొందించి మంత్రివర్గం అమోదిస్తుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ సచివాలయాల ఏర్పాటు అంశంపై కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,33, 867 మంది గ్రామ కార్యదర్శుల నియామకాలకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.

ఆంధ్రప్రదేశ్ లో 11, 114 గ్రామ సచివాలయాలు, పట్టణాలలో 3,786 వార్డులలో సచివాలయాలు ఏర్పాటు చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ఈ కీలక చట్టాలకు ఆమోద వేసిన అనంతరం శాసనసభలో ప్రవేశపెడతారు. వీటిపై సభలో చర్చించిన తర్వాత వీటిని శాసనసభ ఆమోదిస్తుంది.

Tags:    
Advertisement

Similar News