నాకు కాంగ్రెస్ అంటే అభిమానమే.... కానీ త్వరలోనే బీజేపీలో చేరతా !
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం అయ్యారు. దీనిపై ఇవ్వాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాసన సభలో ప్రశ్నించినా…. దానిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చర్చకు అంగీకరించలేదు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు చాలా అభిమానమే… కానీ భవిష్యత్‌లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారం చేపట్టే […]
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం అయ్యారు. దీనిపై ఇవ్వాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాసన సభలో ప్రశ్నించినా…. దానిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చర్చకు అంగీకరించలేదు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు చాలా అభిమానమే… కానీ భవిష్యత్‌లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారం చేపట్టే అవకాశం లేదన్నారు. బీజేపీ మాత్రమే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అన్నారు.
నేను కాంగ్రెస్ పార్టీకి అభిమానిని అయినా త్వరలో బీజేపీలో చేరతానని.. ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగానే బీజేపీలో చేరడానికి అడ్డంకి ఎదురవుతోందని.. త్వరలోనే అవన్నీ క్లియర్ అయ్యాక పార్టీలో చేరతానని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడానికి నాయకత్వ లోపమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కూడా టీపీసీసీ నాయకత్వంలోని లోపాలను ప్రశ్నించినందుకే షోకాజ్ నోటీస్ అందుకున్నానని ఆయన గుర్తు చేశారు.