ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై అరెస్టు వారెంట్ జారీ

తప్పుడు వార్తలు ప్రచురించి తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ గతంలో ఒక వ్యక్తి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కోర్టులో కేసువేశారు. పలు దఫాలు నోటీసులు జారీ చేసినా స్పందించక పోవడంతో రాధాకృష్ణపై అరెస్టు వారెంటు జారీ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన సైదేశ్వర రావు రెండేళ్ల క్రితం కొంత భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఈ కొనుగోలుపై ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తను చూసి […]

Advertisement
Update:2019-07-18 01:47 IST

తప్పుడు వార్తలు ప్రచురించి తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ గతంలో ఒక వ్యక్తి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కోర్టులో కేసువేశారు. పలు దఫాలు నోటీసులు జారీ చేసినా స్పందించక పోవడంతో రాధాకృష్ణపై అరెస్టు వారెంటు జారీ అయ్యింది.

వివరాల్లోకి వెళితే..

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన సైదేశ్వర రావు రెండేళ్ల క్రితం కొంత భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఈ కొనుగోలుపై ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తను చూసి బాధపడిన సైదేశ్వరరావు తనపై అసత్య ఆరోపణలు చేస్తూ పత్రికలో వార్తను ప్రచురించారని.. తన పరువుకు నష్టం జరిగిందని పేర్కొంటూ ఆయన జగ్గయ్యపేట కోర్టును ఆశ్రయించారు.

ఆ తప్పుడు వార్తకు బాధ్యులుగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్, జిల్లా ఇంచార్జి మాధవి, స్థానిక విలేకర్లు వెంకట రమేష్, నాగేశ్వరరావులతో పాటు తప్పుడు ప్రకటన చేసిన నారాయణ, కృష్ణారావుల పేర్లను ఆ దావాలో పేర్కొన్నారు.

దీనిపై విచారణ చేపట్టిన జగ్గయ్యపేట కోర్టు అనేక దఫాలు రాధాకృష్ణ, శ్రీనివాస్‌లకు నోటీసులు జారీ చేసింది. అయితే వారు మాత్రం ఏనాడూ కోర్టు నోటీసులకు స్పందించలేదు. దీంతో బుధవారం జడ్జి వారిద్దరి అరెస్టుకు వారెంట్లు జారీ చేశారు.

కాగా, రాధాకృష్ణ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయగా న్యాయమూర్తి తిరస్కరించారు.

Tags:    
Advertisement

Similar News