జగన్ ఫొటో ఉండడానికి వీల్లేదంటున్న అధికారులు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉన్నతాధికారుల తీరు చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్ రెడ్డి ఉనికినే వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఫొటో చూసేందుకు కూడా వారు అంగీకరించడం లేదు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో గత ముఖ్యమంత్రి ఫొటోను తీసేసి కొత్త ముఖ్యమంత్రి ఫొటోను ఏర్పాటు చేశారు. కానీ హెల్త్ యూనివర్శిటీలో మాత్రం ఇప్పటికీ జగన్‌ మోహన్ రెడ్డి ఫొటో పెట్టే అవకాశం లేకుండాపోయింది. చివరకు వర్శిటీ వీసీ ఆదేశించినా సరే పరిపాలన విభాగం […]

Advertisement
Update:2019-07-17 04:19 IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉన్నతాధికారుల తీరు చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్ రెడ్డి ఉనికినే వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఫొటో చూసేందుకు కూడా వారు అంగీకరించడం లేదు.

ప్రభుత్వం మారిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో గత ముఖ్యమంత్రి ఫొటోను తీసేసి కొత్త ముఖ్యమంత్రి ఫొటోను ఏర్పాటు చేశారు. కానీ హెల్త్ యూనివర్శిటీలో మాత్రం ఇప్పటికీ జగన్‌ మోహన్ రెడ్డి ఫొటో పెట్టే అవకాశం లేకుండాపోయింది.

చివరకు వర్శిటీ వీసీ ఆదేశించినా సరే పరిపాలన విభాగం జగన్ మోహన్ రెడ్డి ఫొటోను పెట్టేందుకు అంగీకరించడం లేదు. ప్రస్తుతం వర్శిటీ పరిపాలన విభాగంలో హవా చెలాయిస్తున్న ఉన్నతాధికారులంతా చంద్రబాబు హయాంలో నియమితులైన వారే. వారు ఇప్పుడు జగన్‌ ఫొటో పెట్టకుండా అడ్డుకుంటున్నారు.

వీసీ ఆదేశాల మేరకు సీఎం ఫొటోను ఏర్పాటు చేసేందుకు కొందరు కింది స్థాయి అధికారులు ప్రయత్నించగా వారిపై బాబు అభిమాన ఉన్నతాధికారులు గుడ్లు ఉరిమారు. దాంతో సీఎం ఫొటో పెట్టే దమ్ము ఎవరికీ లేకుండాపోయింది.

జగన్ మోహన్ రెడ్డి ఫొటో చూస్తే తమ మూడ్‌ పాడవుతుందని టీడీపీ అభిమాన అధికారులు కింది ఉద్యోగుల వద్ద ఓపెన్‌గానే వ్యాఖ్యానిస్తున్నారట.

Tags:    
Advertisement

Similar News