పోలవరం గేటు ప్రచారం ఖర్చు 2.3 కోట్లు

చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్ల దోపిడి జరిగిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో వివరించారు. అంచనా వ్యయాలను ఇష్టానుసారం పెంచేసుకుంటూ వెళ్లారని… వందల కోట్ల విలువైన కాంట్రాక్టులను కూడా నామినేషన్‌ పద్దతి మీద కావాల్సిన వారికి అప్పగించారని వివరించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఒక గేట్‌ ఏర్పాటు కార్యక్రమం ప్రచారానికి రెండు కోట్ల 30 లక్షలు ఖర్చు చేశారన్నారు. ఐదు కోట్ల విలువైన పని అంచనా వ్యయాన్ని పెంచేసి 137 కోట్లకు అప్పగించారని […]

Advertisement
Update:2019-07-17 05:32 IST

చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్ల దోపిడి జరిగిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో వివరించారు. అంచనా వ్యయాలను ఇష్టానుసారం పెంచేసుకుంటూ వెళ్లారని… వందల కోట్ల విలువైన కాంట్రాక్టులను కూడా నామినేషన్‌ పద్దతి మీద కావాల్సిన వారికి అప్పగించారని వివరించారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద ఒక గేట్‌ ఏర్పాటు కార్యక్రమం ప్రచారానికి రెండు కోట్ల 30 లక్షలు ఖర్చు చేశారన్నారు. ఐదు కోట్ల విలువైన పని అంచనా వ్యయాన్ని పెంచేసి 137 కోట్లకు అప్పగించారని మంత్రి వెల్లడించారు.

ఇలాంటివి చాలా బయటపడుతున్నాయన్నారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీకి 350 కోట్ల విలువైన పనులను 16వందల కోట్లకు అప్పగించారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివరించారు.

చంద్రబాబు హయాంలో పనులన్నీ కేవలం ముగ్గురికి మాత్రమే అప్పగించారన్నారు. బాబు హయాంలో జరిగిన వ్యవహారాలపై రివర్స్ టెండరింగ్‌ చేసి… ప్రజల సొమ్మును ఆదా చేసి తీరుతామన్నారు.

Tags:    
Advertisement

Similar News