ఆ వార్తల్లో నిజం లేదు....
టీడీపీ నుంచి బీజేపీ లోకి వలసలు ఊపందుకున్నాయి. ఓడిన నేతలు ఈ ఆరాటంలో ముందున్నారు. తొలిసారి వైసీపీ నేతల పైనా ఈ ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో పెద్దాపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి చిన రాజప్ప చేతిలో ఓడిన తోట వాణి బీజేపీలో చేరుతున్నారని మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ వార్తలను శ్రీవాణి ఖండించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ […]
టీడీపీ నుంచి బీజేపీ లోకి వలసలు ఊపందుకున్నాయి. ఓడిన నేతలు ఈ ఆరాటంలో ముందున్నారు. తొలిసారి వైసీపీ నేతల పైనా ఈ ప్రచారం జరుగుతోంది.
మొన్నటి ఎన్నికల్లో పెద్దాపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి చిన రాజప్ప చేతిలో ఓడిన తోట వాణి బీజేపీలో చేరుతున్నారని మీడియాలో ప్రచారం మొదలైంది.
ఈ వార్తలను శ్రీవాణి ఖండించారు.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించడం మీడియా సంస్థలకు తగదని హితవు పలికారు. భర్త తోట నరసింహం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తోట వాణి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేశారు.