ధోనీకి బీసీసీఐ సంకేతాలు
రిటైర్ కాకుంటే జట్టులో చోటు లేనట్లే 38 ఏళ్ల వయసులోనూ రిటైర్మెంట్ ప్రకటించని ధోనీ ప్రపంచకప్ ముగియటంతోనే భారత ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ భావించారు. కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం రిటైర్మెంట్ గురించి ధోనీ తనతో ఏమీ మాట్లాడలేదని తేల్చి చెప్పాడు. దీంతో …ధోనీ రిటైర్ కాకుంటే భారతజట్టులో చోటు గ్యారెంటీ లేదని బీసీసీఐ సంకేతాలు పంపింది. ధోనీ సగౌరవంగా రిటైర్మెంట్ ప్రకటించి.. రిషబ్ పంత్ లాంటి […]
- రిటైర్ కాకుంటే జట్టులో చోటు లేనట్లే
- 38 ఏళ్ల వయసులోనూ రిటైర్మెంట్ ప్రకటించని ధోనీ
ప్రపంచకప్ ముగియటంతోనే భారత ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ భావించారు.
కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం రిటైర్మెంట్ గురించి ధోనీ తనతో ఏమీ మాట్లాడలేదని తేల్చి చెప్పాడు.
దీంతో …ధోనీ రిటైర్ కాకుంటే భారతజట్టులో చోటు గ్యారెంటీ లేదని బీసీసీఐ సంకేతాలు పంపింది. ధోనీ సగౌరవంగా రిటైర్మెంట్ ప్రకటించి.. రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాళ్లకు మార్గం సుగమం చేయాలని ఎంపిక సంఘం చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ త్వరలోనే కోరనున్నారు.
ఇంగ్లండ్ తో ముగిసిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో…ధోనీ జిడ్డాట ఆడి 31 బాల్స్ లో 42 పరుగులు మాత్రమే చేయటం విమర్శలకు దారితీసింది.
ధోనీలో ఆజోరు ఏదీ?
వెటరన్ మహేంద్రసింగ్ ధోనీలో పసతగ్గిపోయిందని.. భారతక్రికెట్ కు ధోనీ సేవలు ఇక ఏమాత్రం అవసరం లేదని బీసీసీఐ భావిస్తోంది.
ప్రపంచకప్ లో మొత్తం ఎనిమిదిమ్యాచ్ లు ఆడిన ధోనీ 273 పరుగులు మాత్రమే సాధించాడు. 45.5 సగటు, 87.8 స్ట్ర్రయిక్ రేటుతో నిలిచాడు.
15 సంవత్సరాల తన కెరియర్ లో ధోనీ 350 వన్డేలలో 10 వేల 773 పరుగులు సాధించడం విశేషం. 50.6 సగటుతో 87.6 స్ట్ర్రయిక్ రేట్ సాధించాడు.