ప్రపంచకప్ విజేత కోసం 28 కోట్ల ప్రైజ్ మనీ

ఫైనల్లో ఓడిన జట్టుకు 14 కోట్లు  సెమీఫైనల్ల్లో ఓడిన భారత్, ఆసీస్ జట్లకు చెరో 5 కోట్ల 60 లక్షలు ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఐదోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ ఇవ్వటానికి ఐసీసీ ఏర్పాట్లు చేసింది. గత ఆరువారాలుగా సాగిన 10 జట్ల ఈ టోర్నీ ఫైనల్స్ కు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు చేరడంతో…మరికొద్ది గంటల్లో క్లయ్ మాక్స్ కు తెరలేవనుంది. విజేత జట్టుకు 28 కోట్ల నజరానా… […]

Advertisement
Update:2019-07-14 02:12 IST
  • ఫైనల్లో ఓడిన జట్టుకు 14 కోట్లు
  • సెమీఫైనల్ల్లో ఓడిన భారత్, ఆసీస్ జట్లకు చెరో 5 కోట్ల 60 లక్షలు

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఐదోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ ఇవ్వటానికి
ఐసీసీ ఏర్పాట్లు చేసింది.

గత ఆరువారాలుగా సాగిన 10 జట్ల ఈ టోర్నీ ఫైనల్స్ కు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు చేరడంతో…మరికొద్ది గంటల్లో క్లయ్ మాక్స్ కు తెరలేవనుంది.

విజేత జట్టుకు 28 కోట్ల నజరానా…

ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్, 3వ ర్యాంకర్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ రోజు జరిగే ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు 28 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారు. ఫైనల్లో ఓడిన జట్టుకు మాత్రం 14 కోట్ల రూపాయలు చెల్లిస్తారు.

భారత్ కు 5 కోట్ల 60 లక్షలు…

సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్, ఇంగ్లండ్ చేతిలో కంగుతిన్న ఆస్ట్రేలియా జట్లు చెరో 5 కోట్ల 60 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ అందుకోనున్నాయి.

పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో అత్యధికంగా 7 విజయాలు సాధించిన భారతజట్టు..ఒక్కో విజయానికి 28 లక్షల రూపాయల చొప్పున అందుకొంది.

క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ టోర్నీగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ చేరింది. మొత్తం 70 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ తో 2019 టోర్నీని నిర్వహించడం విశేషం.

Tags:    
Advertisement

Similar News