వింబుల్డన్ నయాక్వీన్ సిమోనా హాలెప్

ఫైనల్లో తేలిపోయిన సెరెనా విలియమ్స్  సెరెనా రికార్డు టైటిల్ ఆశలు ఆవిరి 2019 వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో సరికొత్త విజేత అవతరించింది. రుమేనియా ప్లేయర్ సిమోనా హాలెప్ తొలిసారిగా టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి రుమేనియన్ మహిళగా రికార్డుల్లో చేరింది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్ట్ వేదికగా…ఏకపక్షంగా ముగిసిన టైటిల్ సమరంలో 7వ సీడ్ సిమోనా హాలెప్ వరుస సెట్లలో 11వ సీడ్, 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ […]

Advertisement
Update:2019-07-14 04:27 IST
  • ఫైనల్లో తేలిపోయిన సెరెనా విలియమ్స్
  • సెరెనా రికార్డు టైటిల్ ఆశలు ఆవిరి

2019 వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో సరికొత్త విజేత అవతరించింది. రుమేనియా ప్లేయర్ సిమోనా హాలెప్ తొలిసారిగా టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది.

ఈ ఘనత సాధించిన తొలి రుమేనియన్ మహిళగా రికార్డుల్లో చేరింది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్ట్ వేదికగా…ఏకపక్షంగా ముగిసిన టైటిల్ సమరంలో 7వ సీడ్ సిమోనా హాలెప్ వరుస సెట్లలో 11వ సీడ్, 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ సెరెనా విలియమ్స్ ను చిత్తు చేసింది.

సెరెనా ఆశలు ఆవిరి…

ఇప్పటికే ఏడుసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన సెరెనా…24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ తో …ఆల్ టైమ్ గ్రేట్ మార్గారెట్ కోర్ట్ సరసన నిలవాలన్న ఆశలు.. హాలెప్ చేతిలో ఓటమితో అడియాసలుగా మిగిలిపోయాయి.

కేవలం 56 నిముషాలలోనే ముగిసిన ఈ పోరులో 27 ఏళ్ల హాలెప్ ..37 ఏళ్ల వెటరన్ సెరెనాను 6-2, 6-2తో అలవోకగా ఓడించింది.

హాలెప్ పవర్ గేమ్ కు …పవర్ క్వీన్ సెరెనా ఏమాత్రం బదులివ్వలేకపోయింది.

హాలెప్ కు రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్…

2018 లో తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సిమోనా హాలెప్…ఏడాది విరామంలోనే వింబుల్డన్ విజయంతో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం చేసుకోగలిగింది.

ఓ టెన్నిస్ ప్లేయర్ గా తన చిన్ననాటి కల నెరవేరిందని ట్రోఫీ అందుకొంటూ సిమోనా పొంగిపోయింది. చాంపియన్ గా నిలిచిన సిమోనా హాలెప్ కు ట్రోఫీతో పాటు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ సైతం దక్కింది.

Tags:    
Advertisement

Similar News