తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల తిరుపతి దేవస్ధానం నూతన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దర్శనాల్లో కీలకమైన ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులకు చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ అంశంపై మంగళవారం నాడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వీఐపీలకు బ్రేక్ దర్శనం రద్దు చేయడం కీలక నిర్ణయమంటున్నారు. ఇక మీదట 2012 సంవత్సరంలో అమలులో ఉన్న నిర్ణయాలనే తిరిగి ఇప్పుడు పాటించాలన్నది టీటీడీ చైర్మన్ […]

Advertisement
Update:2019-07-14 05:57 IST

తిరుమల తిరుపతి దేవస్ధానం నూతన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దర్శనాల్లో కీలకమైన ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులకు చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ అంశంపై మంగళవారం నాడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వీఐపీలకు బ్రేక్ దర్శనం రద్దు చేయడం కీలక నిర్ణయమంటున్నారు.

ఇక మీదట 2012 సంవత్సరంలో అమలులో ఉన్న నిర్ణయాలనే తిరిగి ఇప్పుడు పాటించాలన్నది టీటీడీ చైర్మన్ ఉద్దేశ్యంగా చెబుతున్నారు. ప్రముఖులు తరచుగా తిరుమల వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవడం వల్ల సామాన్యులకు ఇబ్బందులు కలుగుతున్నాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుమలకు ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే రావాలంటూ టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి కోరుతున్నారు.

ఇప్పటికే ఈ అంశంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమలకు వస్తే బాగుటుందని సూచించారు. టీటీడీ తీసుకుంటున్న ఈ నిర్ణయం పట్ల సామాన్య భక్తులలో హర్షం వ్యక్తం అవుతోంది. అయితే ప్రముఖులను తిరుమలకు రాకుండా నియంత్రించడం ఎంత వరకూ సాధ్యమనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తన సొంత పార్టీ వారినే నియంత్రించగలరా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర్రపతి

భారత రాష్ట్ర్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా తిరుమలకు వచ్చిన రాష్ట్ర్రపతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం ఆదివారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చేరుకుంటారు రాష్ట్ర్రపతి. ఇస్రో సెంటర్ నుంచి ఆదివారం అర్ధరాత్రి చంద్రమండలానికి పంపుతున్న చంద్రయాన్ -2 ప్రయోగాన్ని రాష్ట్రపతి కుటుంబసభ్యులతో కలిసి వీక్షిస్తారు.

Tags:    
Advertisement

Similar News