కమలం దూకుడు.... కారు కలవరం
తెలంగాణలో వరస విజయాలతో దూకుడు మీద ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి భారతీయ జనతా పార్టీ ఝలక్ ఇస్తోంది. శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికలలో కేవలం ఒక్క శాసన సభ్యుడినే గెలుచుకున్న బీజేపీ నాలుగు నెలల అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికలలో టీఆర్ఎస్ కు చెమటలు పట్టించింది. ఈ ఎన్నికలలో నాలుగు స్దానాలు కైవసం చేసుకున్న బీజేపీ తెలంగాణలో విస్తరించేందుకు చకచకా పావులు కదుపుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతితో ఉన్న సీనియర్లను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. […]
తెలంగాణలో వరస విజయాలతో దూకుడు మీద ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి భారతీయ జనతా పార్టీ ఝలక్ ఇస్తోంది. శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికలలో కేవలం ఒక్క శాసన సభ్యుడినే గెలుచుకున్న బీజేపీ నాలుగు నెలల అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికలలో టీఆర్ఎస్ కు చెమటలు పట్టించింది. ఈ ఎన్నికలలో నాలుగు స్దానాలు కైవసం చేసుకున్న బీజేపీ తెలంగాణలో విస్తరించేందుకు చకచకా పావులు కదుపుతోంది.
తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతితో ఉన్న సీనియర్లను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. పార్టీ సీనియర్ నాయకుడు సోమారపు సత్యనారాయణ కమలతీర్దం పుచ్చుకుంటున్నారు. ఆయన దారిలోనే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా బీజేపీలో చేరుతారని అంటున్నారు. వీరు కాక అనేక మంది సీనియర్ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని బిజేపీ నాయకులు చెబుతున్నారు.
తెలంగాణలో జరుగుతున్న ఈ రాజకీయ పునరేకీకరణ తెలంగాణ రాష్ట్ర సమితికి ఇబ్బందిగా మారిందంటున్నారు. “ఆరు నెలలు అరచి పోతారులే” అంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెబుతున్నా బీజేపీ దూకుడును ఆపాలంటూ పార్టీ సీనియర్ నేతలకు ఆదేశాలు జారి చేస్తున్నట్టు సమాచారం. రానున్న ఎన్నికలలో తమదే విజయమని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ చేస్తున్న ప్రకటనలపై కూడా తెరాస నాయకత్వం ఆలోచనలో పడినట్లు సమాచారం. తెలంగాణలో ఎట్టి పరిస్థితులలోను భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా చేయాలన్నదే కేసీఆర్ తక్షణ లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.