వింబుల్డన్ ఫైనల్లో గ్రాండ్ స్లామ్ కింగ్

12వసారి ఫైనల్స్ లో రోజర్ ఫెదరర్  సెమీఫైనల్లో నడాల్ పై ఫెదరర్ గెలుపు ఫైనల్లో జోకోవిచ్ తో టైటిల్ ఫైట్ గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ 12వసారి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు చేరాడు. తన కెరియర్ లో 9వ వింబుల్డన్, 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గెలుపు దూరంలో నిలిచాడు. సెమీస్ లో ఫెదరర్ మొత్తం 14 ఏస్ లు, 41 విన్నర్లు సాధించాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో ఆదివారం జరిగే […]

Advertisement
Update:2019-07-13 05:23 IST
  • 12వసారి ఫైనల్స్ లో రోజర్ ఫెదరర్
  • సెమీఫైనల్లో నడాల్ పై ఫెదరర్ గెలుపు
  • ఫైనల్లో జోకోవిచ్ తో టైటిల్ ఫైట్

గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ 12వసారి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు చేరాడు. తన కెరియర్ లో 9వ వింబుల్డన్, 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గెలుపు దూరంలో నిలిచాడు.

సెమీస్ లో ఫెదరర్ మొత్తం 14 ఏస్ లు, 41 విన్నర్లు సాధించాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో ఆదివారం జరిగే టైటిల్ సమరంలో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు .డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ తో ఫెదరర్ తలపడనున్నాడు.

క్లే కోర్టు కింగ్ కు గ్రాస్ కోర్ట్ బాస్ చెక్..

టెన్నిస్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన వింబుల్డన్ తొలిసెమీఫైనల్లో స్విస్ వండర్ రోజర్ ఫెదరర్, స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ ల సూపర్ ఫైట్ నాలుగుసెట్ల సమరంగా ముగిసింది.

2వ సీడ్ ఫెదరర్ తన అనుభవాన్నంతా ఉపయోగించి…3వ సీడ్ నడాల్ ను అధిగమించాడు. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ కెరియర్ లో ముఖాముఖిన 40వసారి తలపడగా…37 ఏళ్ల ఫెదరర్ 33 ఏళ్ల నడాల్ పైన విజేతగా నిలిచాడు.

ఫెదరర్ 7-6, 1-6, 6-1, 6-4తో విజయం సాధించడం ద్వారా గ్రాస్ కోర్ట్ టెన్నిస్ లో తానే బాస్ నని మరోసారి నడాల్ కు చాటిచెప్పాడు.

గ్రాండ్ స్లామ్ ఫైనల్లో 31వసారి

ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ ..ఓ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టోర్నీ ఫైనల్స్ చేరడం ఇది 31వసారి. రెండో సెమీఫైనల్లో టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్ నాలుగు సెట్ల సమరంలో స్పెయిన్ ఆటగాడు, 23వ సీడ్ రాబర్టో బాటిస్టుటా అగుట్ ను అధిగమించాడు.

డిఫెండింగ్ చాంపియన్ జోకోవిచ్ 6-2, 4-6, 6-3, 6-2తో విజయం సాధించడం ద్వారా ఆరోసారి వింబుల్డన్ ఫైనల్లో అడుగుపెట్టాడు.

అంతేకాదు…గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ చేరడం జోకోవిచ్ కు ఇది 25వసారి కావడం విశేషం.

ఫెదరర్ పై జోకోదే పైచేయి…

రోజర్ ఫెదరర్ ప్రత్యర్థిగా జోకోవిచ్ దే పైచేయిగా ఉంది. జోకో 25-22 విజయాల రికార్డుతో నిలిచాడు.

Tags:    
Advertisement

Similar News