టీడీపీ పాట్లు చూతము రారండి
ఎవరు ఆగ్రహంగా ఉన్నారో…. ఎవరు నిర్వీర్యంగా ఉన్నారో… ఎవరు విచారంగా ఉన్నారో…. ఎవరు ఆందోళనగా ఉన్నారో… తెలియాలంటే వారి ముఖకవళికలు గమనించాలి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని శుక్రవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాలను టివీలో చూసినవారికి కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు అన్న సామెత గుర్తుకువస్తుంది. శాసనసభ ప్రారంభమయిన వెంటనే ముగిసిపోయిన అంశంపై చర్చకు పట్టుబట్టి సభలో గందరగోళం సృష్టించాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యులు భావించారు. అయితే వారి పాచిక పారలేదు. ప్రతిపక్ష సభ్యులు […]
ఎవరు ఆగ్రహంగా ఉన్నారో…. ఎవరు నిర్వీర్యంగా ఉన్నారో… ఎవరు విచారంగా ఉన్నారో…. ఎవరు ఆందోళనగా ఉన్నారో… తెలియాలంటే వారి ముఖకవళికలు గమనించాలి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని శుక్రవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాలను టివీలో చూసినవారికి కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు అన్న సామెత గుర్తుకువస్తుంది.
శాసనసభ ప్రారంభమయిన వెంటనే ముగిసిపోయిన అంశంపై చర్చకు పట్టుబట్టి సభలో గందరగోళం సృష్టించాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యులు భావించారు. అయితే వారి పాచిక పారలేదు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పీకర్ ను కోరడంతో అవాక్కయ్యవా బాబు అన్నట్లు అయ్యింది చంద్రబాబు ముఖం. తాము వేసిన పాచిక పారకపోవడంతో పాటు అది తమకే బూమ్ రాంగ్ కావడం చంద్రబాబును ఇరుకున పెట్టింది. ఆ సమయంలో టీవీలలో చంద్రబాబును చూసిన వారికి అయ్యో పాపం బాబు అనిపించక మానదు.
కరువుపై రెండోసారి ప్రకటన చేసిన ముఖ్యమంత్రి జనన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని అంకెలతో సహా వివరిస్తుంటే చంద్రబాబు నాయుడు దిక్కుతోచని స్ధితిలో కూర్చున్నారు. రైతులకు చెల్లించాల్సిన రుణబకాయిలు, వడ్డీ మాఫీ వంటివి చెల్లించలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లెక్కలతో సహా చెప్పారు.
చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కేవలం 5 శాతం మాత్రమే రైతులకి ఇచ్చి మొత్తం చెల్లించేసినట్లుగా రైతులను నమ్మించిందని అన్నారు. దీనికి ఉదాహరణగా “నేను నారాయణ స్వామి అన్నకు లక్ష రూపాయలు బాకి పడ్డాను. అయితే 5 శాతం అంటే 5000 రూపాయలు నారాయణ అన్నకు ఇచ్చేసి నీ రుణం తీరిపోయింది” అని చెప్పినట్టుగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఉదాహరణ చెప్పినప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ముఖంలో విచారం, కోపం, ఆగ్రహం, ఆవేదన, ఆందోళన, నిస్సహయత అన్ని కలగలసి కనిపించడం విశేషం.