జగన్‌ ఎత్తుకు గంట పాటు విలవిల

తొలిరోజు అసెంబ్లీలో చంద్రబాబు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. అందుకు టీడీపీ ఎమ్మెల్యే పరోక్షంగా కారణం కావడం విశేషం. సభలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు… ప్రభుత్వం రైతుల కోసం ఇప్పుడే సున్నా వడ్డీ పథకాన్ని తెచ్చినట్టు చెప్పుకుంటోందని… కానీ ఈ పథకం కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే మొదలైంది… ఆ తర్వాత చంద్రబాబు కూడా కొనసాగించారు అని చెప్పుకొచ్చారు. ఇంతలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా చంద్రబాబును వ్యవహారంలోకి లాగారు. టీడీపీ […]

Advertisement
Update:2019-07-11 15:44 IST

తొలిరోజు అసెంబ్లీలో చంద్రబాబు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. అందుకు టీడీపీ ఎమ్మెల్యే పరోక్షంగా కారణం కావడం విశేషం.

సభలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు… ప్రభుత్వం రైతుల కోసం ఇప్పుడే సున్నా వడ్డీ పథకాన్ని తెచ్చినట్టు చెప్పుకుంటోందని… కానీ ఈ పథకం కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే మొదలైంది… ఆ తర్వాత చంద్రబాబు కూడా కొనసాగించారు అని చెప్పుకొచ్చారు.

ఇంతలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా చంద్రబాబును వ్యవహారంలోకి లాగారు. టీడీపీ హయాంలో సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయలేదు… ఆ విషయాన్ని తాము నిరూపిస్తామని… అలా నిరూపించాక చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు.

జగన్ మోహన్ రెడ్డి సవాల్ చేయగానే చంద్రబాబునాయుడు స్పందించారు. రియాక్ట్ అయ్యారు సరే… కనీసం తన హయాంలో సున్నా వడ్డీకి రైతులకు రుణాలు ఇచ్చారా? లేదా? అన్న దానిపై స్పష్టత ఇవ్వకుండా… ఇప్పటి ప్రభుత్వం విత్తనాలు కూడా ఇవ్వడంలేదు…. అలాంటి వారు మమ్మల్ని విమర్శించడం ఏమిటి? అంటూ మాట్లాడారు. దాంతో అధికార పార్టీ సభ్యులు పదేపదే లేచి చంద్రబాబును… సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారా? లేదా? సూటిగా చెప్పండి… అంటూ పదేపదే నిలదీశారు.

చివరకు ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో పాలసీ ఉంటుంది. మీరు సున్నా వడ్డీ ఇస్తే ఇచ్చుకోండి. దానికి నేనేందుకు రాజీనామా చేయాలి. నేనేందుకు క్షమాపణ చెప్పాలి…. అంటూ సమస్య నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.

ఎమ్మెల్యే రామానాయుడు అత్యుత్సాహంతో సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు కూడా అమలు చేశాడని చెప్పడం… వెంటనే జగన్ లేచి సున్నా వడ్డీపై చంద్రబాబుకు సవాల్ విసరడం… చంద్రబాబు కూడా జగన్ వేసిన ఎత్తుకు పడిపోయి స్పందించడంతో గంట పాటు సభలో టీడీపీ అధ్యక్షుడు ఇబ్బందిపడాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News