ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జగన్ భరోసా

గత ఐదేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలన్నింటికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించారు. రైతులు ప్రాణాలే కోల్పోయిన తర్వాత వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన జగన్.. గత ఐదేళ్లలో డీసీఆర్‌బీ లెక్కల ప్రకారమే 1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. కానీ వారిలో కేవలం 391 మందికి మాత్రమే గత ప్రభుత్వం పరిహారం చెల్లించిందని జగన్ గుర్తు చేశారు. మిగిలిన కుటుంబాలకు […]

Advertisement
Update:2019-07-10 09:05 IST

గత ఐదేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలన్నింటికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించారు.

రైతులు ప్రాణాలే కోల్పోయిన తర్వాత వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన జగన్.. గత ఐదేళ్లలో డీసీఆర్‌బీ లెక్కల ప్రకారమే 1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. కానీ వారిలో కేవలం 391 మందికి మాత్రమే గత ప్రభుత్వం పరిహారం చెల్లించిందని జగన్ గుర్తు చేశారు.

మిగిలిన కుటుంబాలకు కూడా ఒక్కో రైతు కుటుంబానికి ఏడు లక్షలు చెల్లించాలని కలెక్టర్లను జగన్ ఆదేశించారు. పరిహారం చెల్లించే సమయంలో ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని బాధితుల ఇళ్లకు వెళ్లి అక్కడే ఏడు లక్షల పరిహారం అందజేయాలని కలెక్టర్లను జగన్ ఆదేశించారు.

నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబాల్లో ధైర్యం నింపాలని సూచించారు. రైతులు, కౌలు రైతులు తమకు ఏం కష్టమొచ్చినా ప్రభుత్వం ఉందన్న ధైర్యంతో ఉండేలా ఆత్మస్థైర్యాన్ని నింపాలని జగన్‌ వెల్లడించారు. ఇది మానవత్వం ఉన్న ప్రభుత్వమని ఆ దిశగానే పాలన ఉండాలని కలెక్టర్లతో సీఎం జగన్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News