జగన్‌ ఇంటి ముందు ఆర్పీ ఠాకూర్‌ బాధితుల నిరసన

వివాదాస్పద అధికారిగా పేరుతెచ్చుకున్న మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ బాధితులు బయటకొస్తున్నారు. చంద్రబాబు హయాంలో టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించడంతో పాటు తమపై తప్పుడు కేసులు ఠాకూర్ బనాయింపచేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఠాకూర్ ఏసీబీ డీజీగా ఉన్న సమయంలో తమపై అక్రమ కేసులు బనాయించారంటూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితులు సమిష్టిగా నిరసన కార్యక్రమానికి దిగారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు ఆఫీస్ ముందు బ్యానర్లతో బాధితులు ప్రదర్శన నిర్వహించారు. ఠాకూర్‌ హయంలో బనాయించిన ఏసీబీ కేసులపై సమీక్ష […]

Advertisement
Update:2019-07-09 04:13 IST

వివాదాస్పద అధికారిగా పేరుతెచ్చుకున్న మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ బాధితులు బయటకొస్తున్నారు. చంద్రబాబు హయాంలో టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించడంతో పాటు తమపై తప్పుడు కేసులు ఠాకూర్ బనాయింపచేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఠాకూర్ ఏసీబీ డీజీగా ఉన్న సమయంలో తమపై అక్రమ కేసులు బనాయించారంటూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితులు సమిష్టిగా నిరసన కార్యక్రమానికి దిగారు.

తాడేపల్లిలోని జగన్ క్యాంపు ఆఫీస్ ముందు బ్యానర్లతో బాధితులు ప్రదర్శన నిర్వహించారు. ఠాకూర్‌ హయంలో బనాయించిన ఏసీబీ కేసులపై సమీక్ష చేయాలని కోరారు.

టీడీపీకి తొత్తుగా వ్యవహరించి వందలాది కుటుంబాలను ఇబ్బంది పెట్టిన ఠాకూర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు.

ఏసీబీలో ఇప్పటికీ చంద్రబాబు, ఠాకూర్ మనుషులే హవా చెలాయిస్తున్నారని బాధితులు ఆరోపించారు. తొమ్మిదేళ్లుగా ఏసీబీలో బదిలీలు లేవని.. వెంటనే బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News