ఐస్‌క్రీం చప్పరించిన అమ్మాయిని పట్టుకున్న పోలీసులు
అమెరికాలోని టెక్సాస్‌లో ఒక అల్లరి పిల్ల చేసిన ఆకతాయి పని సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు వారం రోజుల తర్వాత ఆ అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్‌ను విచారిస్తున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు. శాన్ ఆంటోనియా ప్రాంతానికి చెందిన మైనర్ అమ్మాయి వారం క్రితం ఒక మాల్‌కు వెళ్లి అక్కడ ఫ్రీజ్‌లో ఉన్న ఐస్‌క్రీమ్ తీసి చప్పరించింది. తిరిగి బాక్స్‌పై మూత పెట్టి ఫ్రీజ్లో […]
అమెరికాలోని టెక్సాస్‌లో ఒక అల్లరి పిల్ల చేసిన ఆకతాయి పని సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు వారం రోజుల తర్వాత ఆ అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్‌ను విచారిస్తున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు.
శాన్ ఆంటోనియా ప్రాంతానికి చెందిన మైనర్ అమ్మాయి వారం క్రితం ఒక మాల్‌కు వెళ్లి అక్కడ ఫ్రీజ్‌లో ఉన్న ఐస్‌క్రీమ్ తీసి చప్పరించింది. తిరిగి బాక్స్‌పై మూత పెట్టి ఫ్రీజ్లో ఉంచేసి వచ్చింది. ఈ అసహ్యకరమైన దృశ్యాలను బాయ్‌ఫ్రెండ్‌తో రికార్డు చేయించుకుని తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
దీంతో నెటిజన్లు అమ్మాయి తీరుపై మండిపడ్డారు. మాల్ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్య వెనుక బాయ్ ఫ్రెండ్ ప్రోద్బలం ఉన్నట్టు భావిస్తున్నారు. అమ్మాయి మైనర్ అయినప్పటికీ.. అబ్బాయి మేజర్ కావడంతో కేసు అతడి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.
అమెరికా చట్టాల ప్రకారం ఆహారపదార్దాలను ఇలా పాడు చేస్తే 20 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు… 10వేల డాలర్ల జరిమానా విధిస్తారని అక్కడి పోలీసులు వెల్లడించారు.