ఈ మాటలేంది గోరంట్ల మాధవా?

గతంలో ఒకసారి అనంతపురం పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కరువు వల్ల కొందరు మహిళలు వ్యభిచారం వైపు వెళ్లిపోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దాంతో ఒక్కసారిగా నెటిజన్లు పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. వారిలో వైసీపీ వాళ్లూ ఉన్నారు. బతకలేకపోతే చావనైనా చస్తారు కానీ… ఒళ్లు అమ్ముకునే స్థితికి మహిళలు దిగజారబోరంటూ పవన్‌ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు. అయితే వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఏకంగా లోక్‌సభలో అవే వ్యాఖ్యలు చేశారు. గురువారం జీరో […]

Advertisement
Update:2019-07-05 02:11 IST

గతంలో ఒకసారి అనంతపురం పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కరువు వల్ల కొందరు మహిళలు వ్యభిచారం వైపు వెళ్లిపోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దాంతో ఒక్కసారిగా నెటిజన్లు పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. వారిలో వైసీపీ వాళ్లూ ఉన్నారు. బతకలేకపోతే చావనైనా చస్తారు కానీ… ఒళ్లు అమ్ముకునే స్థితికి మహిళలు దిగజారబోరంటూ పవన్‌ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు.

అయితే వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఏకంగా లోక్‌సభలో అవే వ్యాఖ్యలు చేశారు. గురువారం జీరో అవర్లో మాట్లాడిన మాధవ్… ”తమ ప్రాంతంలో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. వ్యవసాయేతర రంగంలో ప్రస్తుతం పనులు లేవు. దాంతో మహిళలు ఒళ్లు అమ్ముకునే దుస్థితి నెలకొంది. వ్యభిచార కూపంలోకి మహిళలు వెళ్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. కరువు పరిస్థితులను సభ దృష్టికి తీసుకొచ్చేందుకు మాధవ్ చేసిన ప్రయత్నం బాగానే ఉంది కానీ… అందుకు మహిళలు ఒళ్లు అమ్ముకుంటున్నారని లోక్ సభలో చెప్పడం… ఆ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అసలు ఒళ్లు అమ్ముకోవడాలు ఇలాంటి కరువు ఉన్న ప్రాంతంలోనే కాదు… బాగా బలోపేతం అయిన ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగానే ఉందని గుర్తు చేస్తున్నారు.

మాధవ్ చెప్పినట్టు అనంతపురం జిల్లాలో కరువు తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే…. దాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో ప్రజలకు వివరిస్తే బాగుంటుంది.

Tags:    
Advertisement

Similar News