సుబ్రమణ్యం కుమార్తెకు డిప్యూటీ కలెక్టర్‌ పోస్ట్

2009 సెప్టెంబర్ 2న నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ ప్రమాదంలో చనిపోయిన ఐఏఎస్‌ సుబ్రమణ్యం కుటుంబానికి ఏపీ ప్రభుత్వం న్యాయం చేసింది. ఆయన కుమార్తెకు డిప్యూటీ కలెక్టర్‌ పోస్టును అప్పగించింది ప్రభుత్వం. సుబ్రమణ్యం కుమార్తె సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులను సింధుకు రిజిస్టర్‌ పోస్టులో పంపించారు. నెలరోజుల్లో ఆమె ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. కారుణ్య నియామకం కింద ఈ పోస్టింగ్ ఇచ్చారు. సింధు బీఏ […]

Advertisement
Update:2019-07-05 01:38 IST
సుబ్రమణ్యం కుమార్తెకు డిప్యూటీ కలెక్టర్‌ పోస్ట్
  • whatsapp icon

2009 సెప్టెంబర్ 2న నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ ప్రమాదంలో చనిపోయిన ఐఏఎస్‌ సుబ్రమణ్యం కుటుంబానికి ఏపీ ప్రభుత్వం న్యాయం చేసింది. ఆయన కుమార్తెకు డిప్యూటీ కలెక్టర్‌ పోస్టును అప్పగించింది ప్రభుత్వం.

సుబ్రమణ్యం కుమార్తె సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులను సింధుకు రిజిస్టర్‌ పోస్టులో పంపించారు. నెలరోజుల్లో ఆమె ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. కారుణ్య నియామకం కింద ఈ పోస్టింగ్ ఇచ్చారు. సింధు బీఏ చదివారు. సివిల్ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్ విభాగంలో సింధుకు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇస్తున్నట్టు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

2017లో సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఏపీ ప్రభుత్వానికి ఓ విన్నపం చేశారు. ఆ వినతిని అప్పటి ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకున్నా.. ఉద్యోగానికి సంబంధించి నిర్ణయం తీసుకోలేదు.

Tags:    
Advertisement

Similar News