మనతో పాటు చుట్టూ ఉన్నవాళ్లు బాగుండటమే పండుగ
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement
మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లు బాగుండటమే పండుగ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకు ఆయన ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వాళ్లు ఏపీ అభివృద్ధికి తోడ్పాడునందించాలని పిలుపునిచ్చారు. పబ్లిక్ - ప్రైవేట్ - పీపుల్ - పార్ట్‌నర్‌షిప్ - పీ4లో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని కోరారు. ఆర్థిక అసమానతలు తొలగిపోయి.. ప్రతి ఒక్కరి జీవితాలు మెరుగు పడితేనే అందరి ఇళ్లల్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని తెలిపారు. ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం పీ4 విధాన పత్రాన్ని విడుదల చేశామని చెప్పారు.
Advertisement