త్వరలో బాబు జైలుకు.... బీజేపీ ఏపీ ఇన్ చార్జ్
కేంద్రంలోని బీజేపీ.. టీడీపీ అధినేత చంద్రబాబును ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేలా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో జట్టుకట్టి, మోడీని గద్దెనెక్కకుండా చూడాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలపై బీజేపీ గుర్రుగా ఉంది. పైగా ఇప్పుడు హోంమంత్రిగా అమిత్ షా ఉండడంతో బీజేపీ దూకుడుగా ముందుకెళ్తోంది. తాజాగా గురువారం మధ్యాహ్నం ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దియోధర్ మరోసారి బాంబు పేల్చారు. 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.. వారు ఎప్పుడైనా […]
కేంద్రంలోని బీజేపీ.. టీడీపీ అధినేత చంద్రబాబును ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేలా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో జట్టుకట్టి, మోడీని గద్దెనెక్కకుండా చూడాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలపై బీజేపీ గుర్రుగా ఉంది. పైగా ఇప్పుడు హోంమంత్రిగా అమిత్ షా ఉండడంతో బీజేపీ దూకుడుగా ముందుకెళ్తోంది.
తాజాగా గురువారం మధ్యాహ్నం ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దియోధర్ మరోసారి బాంబు పేల్చారు. 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.. వారు ఎప్పుడైనా బీజేపీలో చేరొచ్చని సంచలన ప్రకటన చేశారు.
ఇక చంద్రబాబు కూడా జైలుకు వెళ్లే రోజులు దగ్గరలో ఉన్నాయని పునరుద్ఘాటించారు.
ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేపీలో విలీనం చేసుకొని టీడీపీపై ప్రతీకారం తీర్చుకున్న బీజేపీ… ఇప్పుడు ఎమ్మెల్యేలకు సైతం వల విసురుతుండడం, పైగా 18మంది టచ్ లో ఉన్నారని ప్రకటన చేయడం సంచలనంగా మారింది.
ఇప్పటికే అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరారు. ఇదే జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జేసీ చర్చలు జరిపారని సమాచారం.
ఇప్పుడు బీజేపీ కొత్తగా చెబుతున్న లెక్క ప్రకారం 18మంది బీజేపీలోకి జంప్ చేస్తే ఐదుగురే మిగులుతారు. అందులో చంద్రబాబు, అచ్చెన్నాయుడు అయితే పార్టీ వీడరు. దీంతో ఇద్దరు, ముగ్గురు మాత్రమే టీడీపీలో ఉంటారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబును కనుక జైలుకు పంపితే మొత్తం టీడీపీయే లేకుండా పోయే ప్రమాదం ఉంటుందనే చర్చ ఏపీలో సాగుతోంది.