ఇక మిగిలిన బేరసారాలు.... తానా సభల్లో
అమెరికాలో తానా సభలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే కొందరు రాజకీయ నేతలు అమెరికా పయనమయ్యారు. మరికొందరికి టికెట్లు బుక్ అయ్యాయి. తానా సభలకు వెళ్లేందుకు మరికొందరు రెడీ అవుతున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడే చర్చ నడుస్తోంది. తానా సభలకు వెళ్లే రాజకీయ నేతలు అక్కడే జంపింగ్ జపాంగ్లతో చర్చలు జరపబోతున్నారట. ఎవరైతే పార్టీ మారాలని అనుకుంటున్నారో ఆ నేతలు ఇప్పుడు తానా వంక పెట్టుకుని అమెరికా […]
అమెరికాలో తానా సభలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే కొందరు రాజకీయ నేతలు అమెరికా పయనమయ్యారు. మరికొందరికి టికెట్లు బుక్ అయ్యాయి. తానా సభలకు వెళ్లేందుకు మరికొందరు రెడీ అవుతున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగబోతున్నాయి.
అయితే ఇప్పుడు ఇక్కడే చర్చ నడుస్తోంది. తానా సభలకు వెళ్లే రాజకీయ నేతలు అక్కడే జంపింగ్ జపాంగ్లతో చర్చలు జరపబోతున్నారట. ఎవరైతే పార్టీ మారాలని అనుకుంటున్నారో ఆ నేతలు ఇప్పుడు తానా వంక పెట్టుకుని అమెరికా వెళుతున్నారని తెలుస్తోంది. అక్కడ చర్చలు అయితే ఎవరికీ డౌట్ రాదు. అన్ని రకాలుగా మాట్లాడుకోవచ్చు. ఏ నేతతో సమావేశమైనా ఇబ్బంది ఉండదు. ఏమైనా అంటే తానా సభలకు వచ్చాం… కలిశాం… అని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు తానాసభలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వెళుతున్నారు. ఆయనతో పాటు ఇటీవలే చేరిన
సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు కూడా హాజరవుతున్నారు. అయితే ఇప్పుడు రేవంత్రెడ్డి, పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ నేతలు కూడా వెళుతున్నారు.
ఈనేతలంతా కలిస్తే ఇక ఏముంది? ప్యాకేజీ మాట్లాడుకుని బీజేపీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. తానా సభలు రాజకీయ చర్చలకు వేదిక కాబోతున్నాయి అనే చర్చ మాత్రం నడుస్తోంది.