పీసీసీ పదవికి రఘువీరా రాజీనామా.... ఇక కాంగ్రెస్ భూస్థాపితమేనా?

ఏపీలో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలని జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బెట్టువీడని రాహుల్ గాంధీ సంకల్పానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, పీసీసీ అధ్యక్షులు రాజీనామాల బాటలు వేస్తున్నారు. తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ లు రేవంత్ రెడ్డి, పొన్నంలు ఇప్పటికే రాజీనామా చేశారు. వీహెచ్ కూడా తన పదవిని వదులుకున్నారు. ఇప్పుడు […]

Advertisement
Update:2019-07-03 09:10 IST

ఏపీలో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలని జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బెట్టువీడని రాహుల్ గాంధీ సంకల్పానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, పీసీసీ అధ్యక్షులు రాజీనామాల బాటలు వేస్తున్నారు.

తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ లు రేవంత్ రెడ్డి, పొన్నంలు ఇప్పటికే రాజీనామా చేశారు. వీహెచ్ కూడా తన పదవిని వదులుకున్నారు.

ఇప్పుడు తాజాగా ఏపీ పీసీసీ పగ్గాలను రఘువీరారెడ్డి వదలుకొని సంచలనం రేపారు. ఏపీలో అసలు కాంగ్రెస్ కు క్యాడర్ లేదు. నాయకులు లేరు. పెద్దగా పోటీనే లేదు. అటువంటి చోట కాంగ్రెస్ నే నమ్ముకొని అనాదిగా ఆ పార్టీలోనే ఉంటున్న రఘువీరా రాజీనామా చేశారు.

మొన్నటి ఏపీ ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కళ్యాణదుర్గంలో పోటీచేసిన రఘువీరా కూడా ఓడిపోయాడు. పార్టీ ప్రక్షాళన పేరిట రఘువీరా రాజీనామాకు మొగ్గు చూపినా.. అస్సలు ఉనికే లేని ఏపీలో కాంగ్రెస్ పార్టీలో మిగిలిన రఘువీరా రాజీనామా ఓ రకంగా కాంగ్రెస్ లో ఇక ఎవ్వరూ మిగలరని తెలిసిపోతోంది.

Tags:    
Advertisement

Similar News