దోమల మందూ దోచేసారు " ఏపీ మంత్రులు

“ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అవినీతికి అంతు లేకుండా పోయింది. చివరకు దోమలపై దండయాత్ర పేరుతో దోమలను తరిమికొట్టే కార్యక్రమంలోనూ డబ్బులు దోచేశారు ” అని ఆంధ్రప్రదేశ్ మంత్రులు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు కార్యక్రమాలలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ నిమిత్తం ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ సమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ […]

Advertisement
Update:2019-07-01 02:55 IST

“ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అవినీతికి అంతు లేకుండా పోయింది. చివరకు దోమలపై దండయాత్ర పేరుతో దోమలను తరిమికొట్టే కార్యక్రమంలోనూ డబ్బులు దోచేశారు ” అని ఆంధ్రప్రదేశ్ మంత్రులు మండిపడ్డారు.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు కార్యక్రమాలలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ నిమిత్తం ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ సమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన ఐదుగురు మంత్రులతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నియమించిన ముగ్గురు పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గౌతం రెడ్డి, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కురసాల కన్నబాబు, పేర్ని నాని విలేకరులతో విడివిడిగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన 30 అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లుగా మంత్రులు చెప్పారు.

“గత ప్రభుత్వ హయాంలో 30 అంశాలపై పూర్తి స్ధాయిలో విచారణ జరుపుతాం. 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం ” అని మంత్రి కురుసాల కన్నబాబు చెప్పారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్ కార్యక్రమాలను నిర్ణయిస్తుందని, ఇది గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీయడమే తప్ప ఎవరిపైనా కక్ష సాధించడం కాదని మంత్రులు చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ విషయాన్ని అధికారులే స్వయంగా చెప్పారని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. “ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కళ్లకు కట్టినట్లుగా చెప్పారు” అని మంత్రి బుగ్గన అన్నారు.

గడచిన నెల రోజులుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతమైన పాలన అందించారని మరో మంత్రి పేర్ని నాని అన్నారు. “ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది. ఈ నెల రోజుల పాలనపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తున్నాయి” అని మంత్రి పేర్ని నాని అన్నారు.

రైతులతో బ్యాంకర్లు స్నేహపూర్వకంగా మెలగాలని, వారిని ఇబ్బందుల పాలు చేసే చర్యలు తీసుకోకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లుగా మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. “రైతులు ఎట్టి పరిస్థితులలోను ఇబ్బందులు పడకూడదు. వారిని బ్యాంకర్లు ఇబ్బందుల పాలు చేయకుండా చేసే బాధ్యత ప్రభుత్వానిదే” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News