ప్రపంచకప్ లో నేడు మరో సూపర్ డూపర్ ఫైట్

భారత్ కు చెలగాటం…. ఇంగ్లండ్ కు సెమీస్ సంకటం  టాప్ ర్యాంక్ భారత్ కు రెండోర్యాంక్ ఇంగ్లండ్ సవాల్ ప్రపంచకప్ లో హాట్ ఫేవరెట్ భారత్…డబుల్ హ్యాట్రిక్ విజయాలకు ఉరకలేస్తోంది. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 7వరౌండ్ పోటీలో ఆతిథ్య ఇంగ్లండ్ పని పట్టడానికి విరాట్ సేన సిద్ధమయ్యింది. మరోవైపు…సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే.. ఆరునూరైనా భారత్ ను ఇంగ్లండ్ ఓడించి తీరాల్సి ఉంది. నంబర్ వన్ తో నంబర్ టు ఢీ… వన్డే […]

Advertisement
Update:2019-06-30 03:10 IST
  • భారత్ కు చెలగాటం…. ఇంగ్లండ్ కు సెమీస్ సంకటం
  • టాప్ ర్యాంక్ భారత్ కు రెండోర్యాంక్ ఇంగ్లండ్ సవాల్

ప్రపంచకప్ లో హాట్ ఫేవరెట్ భారత్…డబుల్ హ్యాట్రిక్ విజయాలకు ఉరకలేస్తోంది. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 7వరౌండ్ పోటీలో ఆతిథ్య ఇంగ్లండ్ పని పట్టడానికి విరాట్ సేన సిద్ధమయ్యింది. మరోవైపు…సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే.. ఆరునూరైనా భారత్ ను ఇంగ్లండ్ ఓడించి తీరాల్సి ఉంది.

నంబర్ వన్ తో నంబర్ టు ఢీ…

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు..ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా చకచగా సాగిపోతున్నాయి. మొదటి 37 రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లు ముగిసే సమయానికే ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ బెర్త్ లు ఖాయం చేసుకొంటే… ఆఖరి బెర్త్ కోసం ఆతిథ్య ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి.

ఇప్పటి వరకూ ఆడిన ఏడు రౌండ్లలో ఇంగ్లండ్ జట్టు నాలుగు విజయాలు, మూడు పరాజయాలతో 8 పాయింట్లు మాత్రమే సాధించి.. లీగ్ టేబుల్ 5వ స్థానానికి పడిపోయింది.

ఇంగ్లండ్ జట్టు సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే…. బర్మింగ్ హామ్ వేదికగా జరిగే సూపర్ సండే సమరంలో…. టాప్ ర్యాంకర్ భారత్ ను ఓడించి తీరాల్సి ఉంది.

మరోవైపు…. విరాట్ సేన మాత్రం ఇప్పటి వరకూ ఆడిన ఆరురౌండ్లలో 5 విజయాలతో సహా మొత్తం 11 పాయింట్లు సంపాదించి…. దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

ఆరో విజయానికి భారత్ గురి…

మొదటి ఆరు రౌండ్లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, విండీస్, అఫ్ఘనిస్థాన్ జట్లను చిత్తు చేసిన భారత్…తన 7వ రౌండ్ పోటీలో రెండో ర్యాంకర్ ఇంగ్లండ్ ను సైతం మట్టికరిపించడానికి సిద్ధమయ్యింది.

ఇక… ప్రపంచ రెండోర్యాంకర్, నిన్నటి వరకూ ప్రపంచకప్ హాట్ ఫేవరెట్ గా నిలిచిన ఇంగ్లండ్ పరిస్థితి మాత్రం గందరగోళంగా తయారయ్యింది.

రౌండ్ రాబిన్ లీగ్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక జట్ల చేతిలో పరాజయాలు పొందటం ద్వారా… సెమీస్ అవకాశాలను ఇంగ్లండ్ క్లిష్టంగా మార్చుకొంది.

గాయంతో గత మూడుమ్యాచ్ లకు దూరంగా ఉన్న డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్ ను..నూటికి నూరుశాతం ఫిట్ గా లేకున్నా బరిలోకి దించాలని నిర్ణయించింది.

భారత బౌలింగ్ కు సవాల్…

ఓపెనర్ బెయిర్ స్టో, జోస్ బట్లర్, జో రూట్, వోయిన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్ లాంటి స్ట్రోక్ మేకర్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉండటమే కాదు… భారత్ బౌలర్ల సత్తాకు పరీక్షకానుంది.

బర్మింగ్ హామ్ వికెట్ స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉండటంతో భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో పోటీకి దిగే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ సైతం స్పెషలిస్ట్ స్పిన్నర్లు మోయిన్ అలీ, రషీద్ లతో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ తో భారత్ పై దాడికి దిగనుంది.

మ్యాచ్ రోజున వాతావరణ పరిస్థితిని బట్టే తుదిజట్టు కూర్పు ఉండే అవకాశాలున్నాయి.

ప్రపంచ నంబర్ వన్ భారత్, రెండోర్యాంకర్ ఇంగ్లండ్ జట్లు స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే… ఈ సూపర్ సండే ఫైట్… అభిమానులకు పసందైన క్రికెట్ విందుకానుంది.

Tags:    
Advertisement

Similar News