ప్రపంచకప్ లో కివీ ఫాస్ట్ బౌలర్ బౌల్ట్ హ్యాట్రిక్

ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో చెలరేగిన బౌల్ట్  ఆట ఆఖరి ఓవర్ మూడు బాల్స్ లో మూడు వికెట్లు ప్రపంచకప్ హ్యాట్రిక్ సాధించిన తొలి న్యూజిలాండ్ బౌలర్ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్…వన్డే ప్రపంచకప్ లో హ్యాట్రిక్ సాధించిన కివీ తొలిబౌలర్ గా రికార్డుల్లో చేరాడు. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ముగిసిన 8వ రౌండ్ మ్యాచ్ లో బౌల్ట్ చెలరేగిపోయాడు. మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఆస్ట్రేలియా టాప్ స్కోరర్ ఉస్మాన్ క్వాజాతో పాటు..మిషెల్ […]

Advertisement
Update:2019-06-30 02:19 IST
  • ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో చెలరేగిన బౌల్ట్
  • ఆట ఆఖరి ఓవర్ మూడు బాల్స్ లో మూడు వికెట్లు
  • ప్రపంచకప్ హ్యాట్రిక్ సాధించిన తొలి న్యూజిలాండ్ బౌలర్

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్…వన్డే ప్రపంచకప్ లో హ్యాట్రిక్ సాధించిన కివీ తొలిబౌలర్ గా రికార్డుల్లో చేరాడు. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ముగిసిన 8వ రౌండ్ మ్యాచ్ లో బౌల్ట్ చెలరేగిపోయాడు.

మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఆస్ట్రేలియా టాప్ స్కోరర్ ఉస్మాన్ క్వాజాతో పాటు..మిషెల్ స్టార్క్, జేసన్ బెహ్రెన్ డోర్ఫ్ లను సైతం పడగొట్టాడు.

ఆట 50వ ఓవర్ మూడో బంతికి క్వాజాను, నాలుగో బంతికి స్టార్క్, ఐదో బంతికి బెహ్రెన్ డోర్ఫ్ ను బౌల్ట్ అవుట్ చేశాడు.
ప్రస్తుత ప్రపంచకప్ లో తొలి హ్యాట్రిక్ సాధించిన ఘనతను భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ దక్కించుకొంటే… రెండో హ్యాట్రిక్ ను
బౌల్ట్ సాధించగలిగాడు.

పది జట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 37 రౌండ్ల మ్యాచ్ ల్లో 18కి పైగా సెంచరీలు నమోదు కాగా…బౌలర్లు సాధించిన హ్యాట్రిక్ లు రెండంటే.. రెండుమాత్రమే ఉండటం విశేషం.

Tags:    
Advertisement

Similar News