ప్రపంచ మాజీ చాంపియన్ల సమరం నేడే

భారత్-విండీస్ పోరుకు వరుణగండం లేనట్లే ఐదో విజయానికి విరాట్ సేన ఉరకలు బిగ్ హిట్టర్లతో కరీబియన్ ఆర్మీ సవాల్ ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో అజేయంగా నిలిచిన ఏకైకజట్టు భారత్ ..విజయపరంపరను కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. మాంచెస్టర్ వేదికగా కొద్దిగంటల్లో ప్రారంభమయ్యే ఆరో రౌండ్ పోటీలో రెండుసార్లు విజేత విండీస్ తో భారత్ తలపడనుంది. మ్యాచ్ వేదిక ఓల్డ్ ట్రాఫర్డ్ లో గత కొద్దిరోజులుగా పడుతున్న వర్షాలు నిలిచిపోయాయి. వరుణుడు కరుణించడంతో మ్యాచ్ పూర్తిగా 50 ఓవర్లపాటు […]

Advertisement
Update:2019-06-27 01:31 IST
  • భారత్-విండీస్ పోరుకు వరుణగండం లేనట్లే
  • ఐదో విజయానికి విరాట్ సేన ఉరకలు
  • బిగ్ హిట్టర్లతో కరీబియన్ ఆర్మీ సవాల్

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో అజేయంగా నిలిచిన ఏకైకజట్టు భారత్ ..విజయపరంపరను కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది.

మాంచెస్టర్ వేదికగా కొద్దిగంటల్లో ప్రారంభమయ్యే ఆరో రౌండ్ పోటీలో రెండుసార్లు విజేత విండీస్ తో భారత్ తలపడనుంది.
మ్యాచ్ వేదిక ఓల్డ్ ట్రాఫర్డ్ లో గత కొద్దిరోజులుగా పడుతున్న వర్షాలు నిలిచిపోయాయి. వరుణుడు కరుణించడంతో మ్యాచ్ పూర్తిగా 50 ఓవర్లపాటు జరగడం ఖాయమని నిర్వాహక సంఘం చెబుతోంది.

బిగ్ హిట్టర్ల సవాల్…

ప్రపంచకప్ సెమీఫైనల్స్ రేస్ కు ఇప్పటికే దూరమైన కరీబియన్ టీమ్…క్రిస్ గేల్, హిట్ మేయర్, బ్రాత్ వెయిట్, ఇవిన్ లూయిస్ లాంటి బిగ్ హిట్టర్లతో రెండోర్యాంక్ భారత్ కు సవాలు విసురుతోంది.

బ్యాటింగ్ లో నిలకడలేమితో కొట్టిమిట్టాడుతున్న విండీస్…పవర్ ఫుల్ భారత బౌలింగ్ ఎటాక్ ముందు ఏమాత్రం నిలువగలదన్నది అనుమానమే.

మరోవైపు…గత ఐదురౌండ్లలో నాలుగు విజయాలతో అజేయంగా నిలిచిన భారత్ 5వ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.

ఓపెనర్లు రోహిత్, రాహుల్, కెప్టెన్ కొహ్లీ, పాండ్యా, కేదార్ జాదవ్ సూపర్ ఫామ్ లో ఉండడంతో భారత్ 300కు పైగా స్కోరు సాధించే అవకాశాలున్నాయి.

విండీస్ ఫాస్ట్ బ్యాటరీని భారత టాపార్డర్ ఎంత సమర్ధవంతంగా ఎదుర్కొనగలదన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. విండీస్ పై 5-3 రికార్డు… ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకూ విండీస్ తో ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో భారత్ కు 5 విజయాలు, 3 పరాజయాల రికార్డు ఉంది.

హాట్ ఫేవరెట్ భారత్ కు… 9వ ర్యాంకర్ కరీబియన్ టీమ్ ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే.

Tags:    
Advertisement

Similar News