శభాష్ జగన్ " గోరటి వెంకన్న
తాము ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఎన్నో పాటలు రాస్తుంటామని… కానీ ఊహలను నిజం చేస్తూ ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు కవి, గాయకుడు గోరటి వెంకన్న. ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారితే చేర్చుకోబోమని ప్రకటించడం స్వాగతించదగ్గ అంశమని.. అలాంటి రాజకీయాలే కావాలన్నారు. ప్రతి పార్టీ జగన్‌ను ఆదర్శంగా తీసుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారవుతారన్నారు. వాజ్‌పేయి ఒక్క ఎంపీని కొని ఉంటే ప్రభుత్వం నిలబడేదని.. కానీ ఆ పని చేయకుండా ప్రధాని పదవినే […]
తాము ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఎన్నో పాటలు రాస్తుంటామని… కానీ ఊహలను నిజం చేస్తూ ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు కవి, గాయకుడు గోరటి వెంకన్న.
ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారితే చేర్చుకోబోమని ప్రకటించడం స్వాగతించదగ్గ అంశమని.. అలాంటి రాజకీయాలే కావాలన్నారు. ప్రతి పార్టీ జగన్‌ను ఆదర్శంగా తీసుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారవుతారన్నారు. వాజ్‌పేయి ఒక్క ఎంపీని కొని ఉంటే ప్రభుత్వం నిలబడేదని.. కానీ ఆ పని చేయకుండా ప్రధాని పదవినే వదులుకున్నారని గర్తు చేశారు.
ఇప్పుడు జగన్ తిరిగి అలాంటి విలువలనే ఫాలో అవుతున్నారని… జగన్ మీద అభిమానంతో తాను ఈ విషయాలు చెప్పడం లేదని… ఎప్పుడో పాత కాలంలో ఉన్న విలువలను తిరిగి ఇప్పుడు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటే అభినందించకుండా ఉండలేకపోతున్నామన్నారు.
ఏపీలో దళితులకు హోంశాఖతో పాటు ఐదు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా దళితులకు ఇన్ని పదవులు దొరకలేదన్నారు. తాము ఊహల్లో అనుకున్న అంశాలను జగన్ నిజం చేస్తుంటే మనసు పులకించిపోతోందన్నారు గోరటి వెంకన్న.
ఎక్కువ సంఖ్యలో రెడ్లు ఎమ్మెల్యేలుగా గెలిచినా సరే వారిని కాదని దళితులకు, వెనుక బడిన వారికి ఎక్కువ పదవులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. పాలనలో కొన్ని లోపాలు ఉంటాయని… కానీ ఒక విధానాన్ని జగన్ అంగీకరించి ముందుకు రావడం అన్నది మంచి పరిణామమన్నారు గోరటి వెంకన్న.