కేంద్రంలో కీలక నియామకాలు

కేంద్ర ప్రభుత్వంలోని కీలక శాఖలకు ప్రధాని మోడీ నియామకాలు చేపట్టారు. నీతి ఆయోగ్ సీఈవోగా ఇప్పటికే ఉన్న అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 ఏప్రిల్ 1న సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అమితాబ్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని 2021 జూన్ 30 వరకు పొడిగించింది. ఇక కీలకమైన ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లకు […]

Advertisement
Update:2019-06-26 15:20 IST

కేంద్ర ప్రభుత్వంలోని కీలక శాఖలకు ప్రధాని మోడీ నియామకాలు చేపట్టారు. నీతి ఆయోగ్ సీఈవోగా ఇప్పటికే ఉన్న అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 ఏప్రిల్ 1న సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అమితాబ్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని 2021 జూన్ 30 వరకు పొడిగించింది.

ఇక కీలకమైన ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లకు ఈ సారి కొత్త అధిపతులను ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా అరవింద్ కుమార్‌ను, ‘రా’ చీఫ్‌గా సామంత్ గోయల్‌లను నియమించింది. వీరిద్దరూ 1984 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు. అరవింద్ కుమార్ అస్సాం-మేఘాలయ బ్యాచ్‌కు చెందిన వ్యక్తి కాగా.. సామంత్ కశ్మీరుకు చెందిన వారు.

గతంలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ కు సామంత్ గోయల్ వ్యూహకర్తగా ఉన్నారు. దీంతో ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ‘రా’ చీఫ్‌గా నియమించినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News