పొన్నగంటి కూర
మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఆకు కూరలు తినడానికి చాలా మంది ఇష్టపడరు.. దానికి కారణం అవి కొద్దిగా పసరు వాసన వస్తాయని. నోటికి రుచిగా ఉంటేనే తింటారు.. అయితే ఆకు కూరలను కొద్దిగా రుచిగా వండుకుని తింటే చాలా ఉపయోగాలు ఉంటాయి. వాటిలో మొదటిది పొన్నగంటి కూర. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.. ముఖ్యంగా కళ్లకు చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెల్సుకుందాం. ప్రస్తుత జీవనశైలిలో టివి, కంప్యూటర్ లేనిదే రోజు […]
మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఆకు కూరలు తినడానికి చాలా మంది ఇష్టపడరు.. దానికి కారణం అవి కొద్దిగా పసరు వాసన వస్తాయని. నోటికి రుచిగా ఉంటేనే తింటారు.. అయితే ఆకు కూరలను కొద్దిగా రుచిగా వండుకుని తింటే చాలా ఉపయోగాలు ఉంటాయి. వాటిలో మొదటిది పొన్నగంటి కూర. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.. ముఖ్యంగా కళ్లకు చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెల్సుకుందాం.
- ప్రస్తుత జీవనశైలిలో టివి, కంప్యూటర్ లేనిదే రోజు గడవడం లేదు. వీటి వల్ల వచ్చే కాంతి కళ్లకు చాలా హని చేస్తుంది. చిన్న వయస్సులోనే చత్వారం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటప్పుడు తరచూ పొన్నగంటి కూరను తింటే కళ్లకు ఎంతో మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- పొన్నగంటి కూర రసంలో వెల్లుల్లి పాయను దంచి.. దానితో పాటుగా తీసుకుంటే గొంతు, ఉబ్బసం, ఆయాసం వంటి సమస్యలు మాయమవుతాయి.
- కండరాలు, నడుము మరి ఇతర నొప్పులకు పొన్నగంటి కూర తింటే మంచి ఫలితం ఉంటుంది.
- పొన్నగంటి కూర సంతాన సాఫల్యతను పెంచుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
- మలబద్దకం, మూలశంక వ్యాధితో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆవు నేతితో పొన్నగంటి కూరను వండుకుని తింటే మొలల వ్యాధి, మలబద్దకం నివారణ అవుతాయి.
- పొన్నగంటి కూర మన శరీరంలో ఉన్న చెడు రక్తాన్ని శుద్ది చేస్తుంది. దీని వల్ల బీపీ అదుపులో ఉంటుంది.
- తరచు పొన్నగంటి కూర తినడం వల్ల శరీర ఛాయలో మెరుపు వస్తుందని, చర్మం మంచి కాంతివంతంగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
- రక్తపోటును నివారిస్తుంది. తద్వారా గుండెకు సంబంధిచిన సమస్యలు దరి చేరవు.
- బ్రాంకైటిస్ తో బాధపడుతున్న వారికి ఒక చెంచాడు పొన్నగంటి ఆకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- పొన్నగంటి కూరలో ప్రోటీన్లు అధిక శాతం ఉన్నాయి. కాబట్టి ఈ కూరను తరచు తీసుకుంటే ఎంతో మేలు.
- ఇందులో అన్ని రకాల విటమిన్లు, మోగ్నీషియం, ప్రొటీన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.