ఇక చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయాల్సిందే...

ప్రజావేదిక కట్టడాన్ని ఎల్లుండే కూల్చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన నేపథ్యంలో ఆ పక్కనే ఉన్న లింగమనేని భవనం సంగతేంటి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అక్రమ కట్టడాలను సహించేది లేదని… ఆ విషయాన్ని తెలియచెప్పేందుకు, చట్టం అందరికీ సమానం అని తెలిపేందుకే ప్రజావేదిక నుంచి కూల్చేవేతలు మొదలుపెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజావేదిక పక్కనే అక్రమంగా నిర్ణయించిన, చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని భవనాన్ని కూడా భవిష్యత్తులో ప్రభుత్వం కూల్చివేసే […]

Advertisement
Update:2019-06-24 07:08 IST

ప్రజావేదిక కట్టడాన్ని ఎల్లుండే కూల్చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన నేపథ్యంలో ఆ పక్కనే ఉన్న లింగమనేని భవనం సంగతేంటి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

అక్రమ కట్టడాలను సహించేది లేదని… ఆ విషయాన్ని తెలియచెప్పేందుకు, చట్టం అందరికీ సమానం అని తెలిపేందుకే ప్రజావేదిక నుంచి కూల్చేవేతలు మొదలుపెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ నేపథ్యంలో ప్రజావేదిక పక్కనే అక్రమంగా నిర్ణయించిన, చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని భవనాన్ని కూడా భవిష్యత్తులో ప్రభుత్వం కూల్చివేసే అవకాశం ఉంది. అది కూడా అక్రమ కట్టడమే కాబట్టి ప్రభుత్వం కూల్చివేయక తప్పదు.

లేదంటే.. ప్రజావేదిక భవనాన్ని కూల్చిన ప్రభుత్వం మరి అక్రమమైన లింగమనేని భవనాన్ని ఎందుకు కూల్చలేదు అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి రోజులు అటూఇటు అయినా లింగమనేని భవనం నేలమట్టం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు ఇప్పటికైనా అక్రమ భవనాన్ని ఖాళీ చేసి వెళ్తారా? లేదంటే అక్కడే తిష్ట వేస్తారా? అన్నది చూడాలి.

Tags:    
Advertisement

Similar News